నెల్లూరు: అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నాయుడుపేట సెబ్ ఎస్‌ఐ రేవతి తెలిపారు. నాయుడుపేట సెబ్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆమె వివరాలు తెలిపారు. పెళ్లకూరు మండలం రావులపాడు గ్రామంలో దాడులు నిర్వహించి వరలక్ష్మి అక్రమంగా నిల్వ ఉంచిన 10 మద్యం సీసాలను, అదే మండలంలో పెన్నేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద యశోదమ్మ నిల్వ ఉంచిన 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుల్లో ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినటు తెలిపారు.