ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్లు అప్పు చేసిన కుమారుడు.. తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం
ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడని.. తమను పున్నామ నరకం నుంచి గట్టెక్కించే పుత్రుడని ఆశలు పెంచుకున్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. అతి గారాబమే తమ పాలిట మృత్యుపాశమవుతుందని.. కన్న కొడుకే తమ చావుకు కారణమవుతాడని.. పాపం ఆ వెర్రి తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మంచి చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగిన ఆ కొడుకు.. వ్యసనాలకు బానిసయ్యాడు. బెట్టింగులకు బానిసగా మారి కోట్ల రూపాయలు …
Read More »శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం
CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్తున్నారా..? TGSRTC గుడ్‌న్యూస్
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి నాగర్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకుంది. అయినా ఇంకా ఫ్లో వస్తుండటంతో సాగర్ గేట్లను సైతం అధికారులు పైకి ఎత్తారు. మెుత్తం 20 గేట్లను 5 ఫీట్ల మేర పైకి …
Read More »శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!
శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్ రియాల్స్, 90 థాయిలాండ్ …
Read More »శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఓ ఉద్యోగి సిగ్గు లేకుండా..?
శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్‌లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి …
Read More »శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక …
Read More »ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే..
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …
Read More »ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …
Read More »