విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల …
Read More »ఏపీలో యువతకు బంపరాఫర్.. టెన్త్ పాసైనా, ఫెయిలైనా ఫుడ్ పెట్టి ఉచితంగా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైర్డ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్ కండిషనర్, కూలర్, రిఫ్రిజిరేటర్ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్ పరిషత్ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. పదో …
Read More »విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్ లను విక్రయించగా రూ.44,06,600 …
Read More »విజయవాడ లోకో పైలెట్‌ను ఆ ఒక్క కారణంగానే చంపేశా.. షాకింగ్ విషయాలు చెప్పిన బీహార్ నిందితుడు
విజయవాడ రైల్వే స్టేషన్లో లోకోల పైలెట్ హత్య మిస్టరీ వీడింది.. ఎబినేజర్‌ను హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని బీహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. విజయవాడలో లోకో పైలట్ ఎబినేజర్‌ను విధుల్లో ఉండగా.. దేవ్‌కుమార్ ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎబినేజర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐదు టీమ్‌లుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా …
Read More »విజయవాడ దుర్గ గుడిలో భక్తుడి చేతికి పెద్ద గోల్డ్ బ్రాస్లెట్.. అందరి కళ్లు అటువైపే, విలువ ఎంతో తెలుసా!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి ఉన్న బ్రాస్లెట్ అందరినీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చేతికి పెద్ద బ్రాస్లెట్ ఉంది.. దీని బరువు ఏకంగా 1.300 కిలోలు.. విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై రవి చేతికి ఉన్న ఈ బ్రాస్లెట్ను భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఇవాళ …
Read More »తిరుమలలో హోటల్స్ సీజ్, లైసెన్స్‌లు రద్దు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో నిబంధనలు పాటించని హోటల్స్, వాహనాలపై టీటీడీ ఎస్టేట్, రవాణా విభాగాలు చర్యలు తీసుకున్నాయి. తిరుమలలో టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భక్తులకు అధిక ధరలకు తినుబండాలు విక్రయిస్తూ, పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో తనిఖీలు నిర్వహించారు. ముందుగా పీఏసీ- 2 (మాధవ నిలయం) వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, రెండు ఫ్యాన్సీ షాపులను సీజ్ …
Read More »నేటి అలంకరణ శ్రీ మహాచండీదేవి ఆశ్వీయుజ శుద్ధ పంచమి, సోమవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరు దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీమహాచండీ దేవివి ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు. శ్రీమహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ …
Read More »బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు.. రూపాయి, రూపాయి కూడబెట్టి
విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను …
Read More »ఏపీకి, విజయవాడవాసులకు కేంద్రం శుభవార్త.. చంద్రబాబు రిక్వెస్ట్‌తో వాటన్నిటికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు దక్కాయి. తాజాగా విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కి.మీ. మేర సూపర్‌స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుల్ని ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు రూ.12,029 …
Read More »నేటి అలంకారం శ్రీ గాయత్రీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ఆశ్వయుజ శుద్ధ విదియ, శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ముఽఖాలతో, ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో, శిరస్సున చంద్రరేఖతో, దశ హస్తాలలో ఆయుధ- ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకూ …
Read More »