గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …
Read More »ఏపీ బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో అడ్డంగా బుక్, వీడియో వైరల్
ఏపీకి చెందిన బీజేపీ నేత నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మీడియా కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా కనిపించారు. గుంటూరుజిల్లాకు చెందిన నేత వీడియోకాల్‌లో మహిళతో మాట్లాడారు. ‘రేపు రాత్రికి రా.. ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో వినిపించింది.’రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్. ఇద్దరం కలిసి మందు కొడదాం’ అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం కలకలం …
Read More »సిటీ కేబుల్‌లో బూతు వీడియోలు.. గంటపాటూ, ఇబ్బందిపడ్డ జనాలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు సిటీ కేబుల్‌లో బూతు వీడియాలు కలకలం రేపాయి. టీవీలు చూస్తున్న జనాలు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాకయ్యారు. నందికొట్కూరులో ఫిరోజ్ కేబుల్‌లో ఆపరేటర్ల అజాగ్రత్తతో గంట పాటు బూతు వీడియోలు ప్రసారం అయ్యాయి. దసరా పండుగ కావడంతో పిల్లలకు సెలవులు కావడంతో ఇంట్లో ఉంటూ టీవీలు చూస్తున్నారు.. అలాంటి సమయంలో ఈ వీడియోలు ప్రసారం కావడంతో చిన్నారులు, మహిళలు ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. సిటీ కేబుల్ నడుపుతున్న ఫిరోజ్‌కి నియోజకవర్గంలో దాదాపు 10 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఈ …
Read More »వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు
వైఎస్సార్‌సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. వాస్తవానికి …
Read More »కాలు దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు.. పాపం ప్రాణాలే పోయాయి, డేంజర్ బ్యాక్టీరియా
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో పలు ప్రాంతాలు మునిగిపోయాయి. విజయవాడతో పాటుగా గుంటూరులోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. అయితే జగ్గయ్యపేటలో ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఓ బాలుడు కాలును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 81 ఏళ్ల వృద్ధుడు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు నెహ్రూనగర్ ఆరో వీధిలో నివాసం ఉంటున్న నారాయణకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. నారాయణ …
Read More »జగన్ లండన్ ప్రయాణం వాయిదా.. ఆ పాస్‌పోర్ట్ రద్దు చేయడంతో, ఏమైందంటే!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి.. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ రద్దుయ్యింది.. దీంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి.. ఏడాదికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఐదేళ్ల పాటూ …
Read More »ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు
ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరో ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు. ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ …
Read More »గుంటూరులో కారు కొట్టుకుపోయి టీచర్, విద్యార్థులు మృతి;
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయి, స్కూల్ టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మానిక్‌గా గుర్తించారు. మంగళగిరి మండలం, ఉప్పలపాడుకు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర (38).. నంబూరులోని వివా స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన అనంతరం.. ఇంటికి బయల్దేరే …
Read More »కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్, ఎస్‌ఈబీ రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »