హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం …
Read More »నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …
Read More »యాదాద్రి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి గుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం.. ఈవో అధికారిక ప్రకటన
Photos Videos ban in Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం …
Read More »నీ అయ్య లెక్క అందరూ ఉండరు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్.. నెటిజన్ల ఘాటు కామెంట్లు
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే క్రమంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల్లా కాకుండా.. సాధారణ ప్రజల్లా అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల నుంచి చీత్కారాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. ఎంపీ చామల కిరణ్ …
Read More »హైదరాబాద్: షవర్మా ఇష్టంగా తింటున్నారా..? అమ్మబాబోయ్, నమ్మలేని నిజాలు
హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా.. సికింద్రాబాద్లోని పలు షవర్మ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ముజ్ తాబా గ్రిల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షవర్మా సెంటర్ల నిర్వహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు …
Read More »కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని.. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. పోలీసుల త్యాగాలు …
Read More »యాదగిరిగుట్టపై భార్యతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి ఫొటోషూట్.. నెట్టింట ఆసక్తికర చర్చ..!
తరచూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కునే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ చేసుకున్న విమర్శలు దాడులకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సైలెంట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఆదివారం (అక్టోబర్ 20న) …
Read More »స్కూల్ ఫీజు కట్టలేని స్థితి నుంచి.. ’70 కోట్ల టర్నోవర్’ స్థాయికి.. నిజామాబాద్ జిల్లా రైతు సక్సెస్’పూల’ స్టోరీ..!
Nizamabad Farmer Flower cultivation: కడుపేదరికం.. వ్యవసాయమే జీవనాధారం.. కానీ పంటలు పండకపోవటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదో తరగతి చదువుతున్న తాను స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో చదువు మానేశాడు. కుటుంబానికి సాయంగా ఉండాలని భావించాడు. ఆరోజున నెలకు వెయ్యి రూపాయలు జీతమొచ్చే పనిలో చేరిన ఆ కుర్రాడు.. నేడు సుమారు 200 మందికి పైగా జీవనోపాధి కల్పింటమే కాదు.. సంవత్సరానికి 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇది ఎక్కడో చందమామ కథల్లోనో.. పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్టోరీనో …
Read More »కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …
Read More »టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు
ఆయనో జిల్లా కలెక్టర్.. పాలనా సంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం …
Read More »