Jobs

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు …

Read More »

స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం

APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి …

Read More »

ఒకేసారి 3 శుభవార్తలు చెప్పిన ప్రముఖ టెక్ సంస్థ.. అంచనాల్ని మించి లాభాలు.. ఉద్యోగులకు పండగే!

L and T Technology Services: ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫలితాల్ని వెల్లడించగా.. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం మేర పెరిగి రూ. 319.60 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సమయంలో లాభం రూ. 315.4 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రెండో త్రైమాసికంలో …

Read More »

టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఈ రంగాలకే ఫుల్ డిమాండ్!

Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్‌క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, …

Read More »

39,481 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇందులో మహిళలకు 3869 పోస్టులు.. 10th Class అర్హత.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేది!

SSC GD Constable Recruitment 2025 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పురుషులకు 35,612 పోస్టులు ఉండగా.. మహిళలకు 3869 పోస్టులున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్‌ బేసిస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం

తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 7 దరఖాస్తులకు చివరితేది. ఇతర ముఖ్యమైన సమాచారం : మిడిల్ లెవల్ …

Read More »

యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …

Read More »

రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇంటర్‌, డిగ్రీ అర్హత

RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ …

Read More »

ఎట్టకేలకు దిగొచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. వారందరికీ ఉద్యోగాలు.. ఇప్పటికే ఆఫర్ లెటర్స్!

ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ …

Read More »

 ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్‌సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!

Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ …

Read More »