Wednesday, May 25, 2022
Google search engine
Homeవార్తలుదిన ఫలాలుఆ రాశివారికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం..!

ఆ రాశివారికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం..!

Horoscope Today: మార్చి 5 శనివారం నాడు కొన్ని రాశుల వారు కొత్త అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. మొదట్లో కొంత ఇబ్బంది పడినా.. అది దినచర్యగా మారడానికి ఓ మార్గం కనుగొంటారు.

మరో రాశివారు దగ్గరి మిత్రుల నుంచి శుభవార్త వింటారు. పని ప్రదేశాల్లో కావాలనే కొందరూ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. దీంతో జాగ్రత్త అవసరం. ఇలా మేషం నుంచి మీనం వరకు.. మార్చి 5, శనివారం నాడు ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయో తెలుసుకుందాం.

* మేషం

ఈ రాశివారు వారు అనుకున్న దానికన్నా ఎక్కువ బిజీగా ఉండొచ్చు. కొన్ని అనుకోని పనుల వల్ల అధిక సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తినే ఆహారం పట్ల ప్రత్యే శ్రద్ధ చూపడం మంచిది. అత్యవసరం అయితే తప్ప ఇప్పటికిప్పుడు ఏ పనులను చేయడానికి ఒప్పుకోవద్దు.

లక్కీ సైన్- మల్లెపువ్వు

* వృషభం

క్లోజ్ ఫ్రెండ్ ద్వారా మంచి వార్త వినే అవకాశం ఉంది. గతంలో వాయిదా వేసిన వాటిని ప్రస్తుతం అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఉదయాన్నే బద్ధకంగా ఉంటే.. ఉత్సాహం కోసం ప్రయత్నించండి.

లక్కీ సైన్ -నిమ్మకాయ సువాసన

* మిథునం

ఈ రోజు మీరు ఆర్థికంగా లాభం కలగవచ్చు. ఏదైనా కారణాల వల్ల రాకుండా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అందుకు మీరు కొత్తగా కమిట్‌మెంట్ ఇవ్వాల్సి రావొచ్చు. మీ పిల్లలకు సంబంధించిన వ్యాపారాన్ని ఓసారి సమీక్షించడం మంచిది. పని నుంచి విరామం తీసుకోవడాన్ని స్వాగతించండి.

లక్కీ సైన్ – రెండు ఉడుతలు

* కర్కాటకం

గతంలో మీ ప్రణాళికలు మీకు కలిసిరావచ్చు. వన్‌సైడ్ రిలేషన్స్‌ అర్ధంకాక వాటి నుంచి తవ్వరగా బయటడటానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా పరిశ్రమలోని వ్యక్తులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కానీ దాన్ని అర్ధం చేసుకునే అవకాశం ఉంది.

లక్కీ సైన్- డేగ

* సింహ

మీకు వ్యక్తిగతంగా ఈ రోజు చాలా ముఖ్యం. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈ రోజు మంచిది. మీ జీవిత భాగస్వామికి మీ మద్దతు అవసరం. అయితే మీరు వారి కోసం సమయం కేటాయించలేకపోవచ్చు. ఈ విషయంపై దృష్టి పెట్టడం మంచిది.

లక్కీ సైన్- నోటీస్ బోర్డు

* కన్య

మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. వచ్చే ఫలితాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇటీవల జరిగిన విషయాలపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేకపోవచ్చు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.

లక్కీ సైన్ – పసుపు నీలమణి

* తుల

ఈ రోజు మీకు పరిపూర్ణమైనది. దీన్ని మీరు పూర్తిగా అనుభవించాలి. ఎప్పుడూ వ్యవస్థీకృతంగా ఉండటానికి ప్రయత్నించండి. మంచి మార్గం వైపు వెళ్లేందుకు శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మొత్తానికి నేడు మీకు అన్ని విధాలుగా మంచిరోజు.

లక్కీ సైన్ – కొత్త గాడ్జెట్

* వృశ్చికం

కొత్త అలవాటు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఇటీవల కలుసుకున్న వారిని నమ్మవచ్చు. అయితే మనసులో మాత్రం గందరగోళం ఉంటూ అయోమయానికి గురికావచ్చు. దీంతో మీరు క్రమబద్ధంగా ఉండటానికి కొత్త దినచర్యను అలవాటు చేసుకోండి.

లక్కీ సైన్ – లైట్ల స్ట్రింగ్

* ధనుస్సు

అనవసర విషయాలపై మాట్లాడకపోవడం మంచింది. మీరు సహనం ప్రదర్శించాలి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ అందుకు సరైన కమ్యూనికేషన్ అవసరం. పనుల్లో మీకు ఎవరైనా ఇబ్బందులు సృష్టించవచ్చు.

లక్కీ సైన్ – వెనిలా సువాసన

* మకరం

మీ లక్ష్యాలను నిర్దేశించుకునే మంచి రోజు ఇది. ఇతరులపై చర్యలు తీసుకోవడానికి అంతర్గతంగా ఎన్నో రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. భయాన్ని వీడండి. సవాల్ ను స్వీకరించండి.

లక్కీ సైన్- పుట్టగొడుగుల మొక్క

* కుంభం

మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కొంత ఆలస్యం కావచ్చు. కొత్త ఆలోచనలను స్వాగతించండి. ఇది కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే ఇందుకు ఓ మార్గాన్ని కనుగొంటారు.

లక్కీ సైన్- నిర్మలమైన ఆకాశం

* మీనం

మీ భయాలు నిజమవుతున్నాయనే భావన మీకు ఉండవచ్చు. కానీ ఏదో ఒకవిధంగా ఈ రోజును సమర్థవంతంగా ముగిస్తారు. కొత్త అవకాశం రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

లక్కీ సైన్ – పర్పుల్ కలర్ పువ్వులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments