తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. టీటీడీ జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా …
Read More »Tag Archives: tirupati
ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం, వాతావరణశాఖ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్రంగా బలపడింది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.. బుధవారం నాటికి తుఫాన్‌గా, గురువారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారొచ్చని ఐఎండీ చెబుతోంది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా బలపడితే ఖతర్ సూచించిన దానా …
Read More »Tirupati Laddu: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు
Tirupati Laddu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. ఓ లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆ పిల్‌ను స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు సమన్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. మరో మూడ్రోజులే, త్వరపడండి
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లను టీటీడీ వేలం వేస్తోంది. ఆసక్తి ఉన్నవారు సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానించింది.. టెండర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వరకు సేకరించేందుకు అవకాశం ఉంటుంది. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో …
Read More »తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. హమ్మయ్యా ఆ సమస్యకు చెక్!
తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించడంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. కొండపై అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీసుబ్బరాయుడు.. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక …
Read More »తిరుమల లడ్డూ కౌంటర్‌లలో సరికొత్త విధానం.. ఇకపై భక్తులకు ఈజీగా, మెషిన్లు వచ్చేశాయి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. లడ్డూల విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. తిరుమలలోని కౌంటర్ల దగ్గర ఎలాంటి ఆలస్యం లేకుండా.. త్వరగా భక్తులకు లడ్డూలను అందిస్తోంది. గతంలో చెప్పినట్లుగానే ఆధార్ ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు.. దీని కోసం ప్రత్యేకంగా స్కానింగ్ మెషిన్లను తీసుకొచ్చారు అధికారులు. టీటీడీ ఐటీ విభాగం.. తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే పనిలో ఉంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలను ప్రస్తుతం …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు చంద్రబాబు శుభవార్త.. టీటీడీకి కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన టీటీడీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని.. కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు అన్నారు. ఈ విషయంలోనూ రాజీ పడొద్దని.. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగపడాలని సూచించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. టీటీడీ సేవలపై …
Read More »కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్ విడుదల, ముఖ్యాంశాలివే!
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి …
Read More »బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …
Read More »