విజయవాడ: నీళ్లలో తిరిగి కాలు పోగొట్టుకున్న బాలుడు.. ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్

ఇటీవల వరదలు విజయవాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అయితే వరద నీటిలో తిరిగిన ఓ బాలుడు కాలును పోగొట్టుకున్నాడు. నీళ్లలో తిరిగితే కాలు పోయిందా అంటే.. దీనికి వెనుక కారణం ఉంది. ఒక బ్యాక్టీరియా కారణంగా బాలుడు కాలును కోల్పోవాల్సి వచ్చింది.. రెండో కాలుకు కూడా ఆ బ్యాక్టీరియా సోకింది. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కొత్తా నాగరాజు ప్రైవేట్ కంపెనీలో.. కోడలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు.

భవదీప్ కాలికి చిన్న గాయమై చర్మం చీలింది.. ఇటీవల వరదల సమయంలో నీటిలో కాలు నానడంతో రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చింది. వెంటనే కాలు కూడా వాపు రావడంతో స్థానికంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ డాక్టర్లు సూచనతో బాలుడ్ని పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.. అక్కడ డాక్టర్లు కూడా హైదరాబాద్ తీసుకెళ్లమని సూచించారు. కానీ బాలుడి తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చేర్పించారు.

బాలుడి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ఎలా ప్రవేశించింది..అంత వేగంగా కాళ్ల కండరాలను ఎలా తినేసింది అనేది డాక్టర్లు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భవదీప్ శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన నమూనాలను పరీక్షలు చేయించారు. బాలుడి శరీరంలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు గుర్తించారు. వీటిలో కూడా ప్రమాదకరమైనవి ఉంటాయని.. అవి శరీరంలోకి వెళ్లడంతోనే కాళ్లు బాగా వాచాయన్నారు.

వరద నీటిలో మురుగు నీరు కలిసిసన సమయంలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు. బాలుడికి జ్వరం వచ్చిన సమయంలో స్థానికంగా ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లగా.. అక్కడ యాంటీబయాటిక్, స్టెరాయిడ్‌ ఇంజక్షన్లను ఇచ్చారు. అయితే ఇలా ఇంజక్షన్లు ఇవ్వకూదంటున్నారు డాక్టర్లు. కాళ్లు వాపులు వస్తే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. బాలుడు కోలుకునేందుకు కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని చెబుతున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *