కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే ప్రచారాన్ని సీబీఐ తోసిపుచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి నిర్దారణకు వచ్చింది. అత్యంత పాశవికంగా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్యచేశాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణ ‘చివరి దశ’లో ఉందని, త్వరలోనే అభియోగాలు నమోదుచేస్తామని తెలిపాయి. ఈ ఘోరమైన నేరం విషయంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా …
Read More »Tag Archives: kolkata
మాజీ ప్రిన్సిపల్ భారీ కుట్రదారు.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సందీప్ ఘోష్‌పై సీబీఐ తరఫు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తవ్వితీయాల్సిన అవసరం ఉందని వివరించారు. సందీప్ ఘోష్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన …
Read More »కోల్‌కతా హత్యాచార నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్.. అసలేంటీ పరీక్ష, అందులో నిజం ఎలా తెలుస్తుంది?
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి పాలీగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే జైలులోనే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సీబీఐ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సంజయ్ రాయ్‌తోపాటు …
Read More »వైద్యురాలిపై హత్యాచారానికి ముందు ఏం జరిగింది? కీలక విషయాలు గుర్తించిన సీబీఐ
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆమె సహచర వైద్యులను విచారిస్తోన్న సీబీఐ.. వారికి లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వారు పొంతనలేని వాంగ్మూలాలు ఇవ్వడమే ఇందుకు కారణం. వీరిలో ఓ హౌస్ సర్జన్, ఓ ఇంటెర్న్, ఇద్దరు మొదటి సంవత్సరం పీజీ డాక్టర్లు ఉన్నారు. ఈ నేరంలో వీరి భాగస్వాములైనట్టు కనిపించడం లేదు, కానీ …
Read More »మనిషి కాదు పశువు, అశ్లీల వీడియోలకు బానిస.. కోల్‌కతా నిందితుడిపై సీబీఐ అధికారి
RG Kar Hospital: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణకు సంబంధించి కోల్‌కతా పోలీసులతోపాటు సీబీఐ అధికారులు కూడా సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. ఈ కేసు విచారణను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, కోల్‌కతా పోలీసులు.. నివేదిక అందించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఓ సీబీఐ అధికారి.. నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. …
Read More »ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Kolkata Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సీబీఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసును ఆగస్టు 20 వ తేదీన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబందించి వాదనలు వింటుండగా.. దీనిపై స్టేటస్ రిపోర్టు అందించాలని …
Read More »కోల్‌కతా హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్రంగా మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందనిని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి.. మరోచోట ప్రిన్సిపల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని …
Read More »కోల్‌కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని డిమాండ్.. దటీజ్ కేసీఆర్: కేటీఆర్
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యంత అమానుష ఘటనపై దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయం చేయాలంటూ.. వైద్య విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని.. మిగతా రాష్ట్రాల వైద్య విద్యార్థులు డిమాండ్ …
Read More »Kolkata Doctor Case Updates: మమతాపై నమ్మకం ఉండేది, కానీ..: వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని చెప్పారు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా ప్రయత్నం చేస్తోందని వైద్యురాలి తండ్రి అన్నారు. తన కుమార్తె రాసుకున్న డైరీని సీబీఐ అధికారులకు అందజేశానన్న ఆయన.. అందులోని అంశాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. ‘ముందు మమతా బెనర్జీపై నాకు …
Read More »బాధితురాలిని హత్యాచారం చేసిన చోటును ఫోటోలతో సహా చూపించండి.. హైకోర్టు ఆదేశాలు
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …
Read More »