పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.
Check Also
ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …