విండ్‌ఫాల్ టాక్స్ భారీగా తగ్గించిన కేంద్రం.. ఏకంగా 50 శాతం.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Latest Petrol Diesel Prices: దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటివి ఉంటాయి. క్రూడాయిల్‌పైనే అత్యధికంగా కేంద్రం పన్ను విధిస్తుంటుంది. అంతర్జాతీయంగా రేట్లకు అనుగుణంగా ప్రతి నెలలో రెండు సార్లు దీనిని సవరిస్తుంటుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఇప్పటికే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్ కేంద్రం భారీగా తగ్గించగా.. ఇప్పుడు మరోసారి పెద్ద మొత్తంలో తగ్గించి ఆయిల్ కంపెనీలకు శుభవార్త అందించింది. క్రూడాయిల్‌పై టన్నుకు ఇదివరకు విండ్‌ఫాల్ టాక్స్ రూ. 4600 గా ఉండగా.. ఇప్పుడు దానిని ఒకేసారి 50 శాతంకుపైగా తగ్గించేసి రూ. 2100 కి చేర్చింది.

పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం భారీగా తగ్గించినా.. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై మాత్రం యథాతథంగానే ఉంచింది. అంటే వీటిపై ఎప్పట్లానే విండ్‌ఫాల్ టాక్స్ జీరోగా ఉంది. ఈ కొత్త రేట్లు 2024, ఆగస్ట్ 17 నుంచి వర్తిస్తాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు కేంద్రం.. జులై 31న క్రూడాయిల్‌పై టాక్స్‌ను టన్నుకు రూ. 7000 గా ఉండగా.. 34.3 శాతం తగ్గించి రూ. 4600 కు చేర్చింది. దానికి ముందు జులై 15న రూ. 6 వేల నుంచి 7 వేలకు పెంచింది. జులై 1న రూ. 3250 నుంచి 6 వేలకు పెంచింది. ఇప్పుడు మాత్రం వరుసగా రెండోసారి కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని 2022, జులై 1న తీసుకొచ్చింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా చమురు రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనిని సొమ్ము చేసుకునేందుకు దేశీయంగా ఆయిల్ కంపెనీలు.. ఇక్కWINDFALL TAX డ చమురు వెలికితీసి పెట్రోల్, క్రూడ్, డీజిల్, ఏటీఎఫ్ రూపంలో విదేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసి లాభాలు ఆర్జించాయి. దేశీయంగా విక్రయించకుండా బయటకు తరలిస్తున్న క్రమంలో.. ఈ లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం.. ఈ విధానం ప్రవేశపెట్టింది. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) కింద దీనిని వసూలు చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రం ఈ రేట్లను సవరిస్తుంటుంది.

విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం వల్ల.. దేశీయంగా చమురు సంస్థలైన ఆయిల్ ఇండియా, రిలయన్స్, గెయిల్, ఓఎన్‌జీసీ వంటి కంపెనీలు లాభపడతాయి. కట్టాల్సిన టాక్సులు తగ్గుతాయన్నమాట. ఇక ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపదు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు రేట్లు తగ్గితే.. దానికి అనుగుణంగా ఇవి మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటర్ రూ. 107.41 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ. 95.65 వద్ద కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం వీటిపై లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గించింది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *