నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 29న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు నాని. ఇంతలో అక్కడ హీరోయిన్ సమంత అనుకోకుండా నానిని కలిసింది.
టాలీవుడ్‌ను పట్టించుకోవట్లేదుగా
సమంతను చూసిన వెంటనే నాని పలకరించారు. సామ్ కూడా చాలా సరదాగా నానితో మాట్లాడింది. అయితే ముంబై దేనికి అని సమంత అడగడంతో సినిమా రిలీజ్ ఉంది అంటూ సరిపోదా శనివారం విశేషాలు పంచుకున్నారు నాని. అయితే సమంత అవునా నాకు తెలీదు.. నేను చూడలేదు.. ఇప్పుడే ట్రైలర్ చూస్తా అంటూ ఫోన్ తీశారు. ఇలా వీరిద్దరూ అనుకోకుండా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సామ్-నాని కలిసినందుకు పోస్టులు పెడుతున్నారు.
అయితే వీరి కాంబోలో గతంలో వచ్చిన ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలు ఆడియన్స్‌న బాగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది మాత్రం సామ్ అసలు టాలీవుడ్‌ను పట్టించుకోవడమే మానేసింది.. నాని సినిమా రిలీజ్ అవుతుందన్న విషయమే సమంతకి తెలీదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాని-సమంత కలిసి నటించి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయింది. ఇక నానిని కలిసిన ఆనందంలో తనతో తీసుకున్న సెల్ఫీని సమంత ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. “ఈరోజు స్వీట్ సర్‌ప్రైజ్ నాని.. ఆల్ ది బెస్ట్ ఫర్ సరిపోదా శనివారం” అంటూ సమంత స్టోరీలో పోస్ట్ చేసింది.
ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే ఇటీవల సినిమాలకి కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే వరుణ్ ధావన్‌తో కలిసి సామ్ చేసి ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 7న విడుదల కానుంది. అలానే ‘మా ఇంటి బంగారం’ అంటూ ఓ చిత్రాన్ని కొన్ని నెలల క్రితమే సామ్ ప్రకటించింది. దీనికి ఆమె నిర్మాత కూడా. మరోవైపు నాని ఇప్పటికే రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకొని హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. దసరా, హాయ్ నాన్న చిత్రాలు నానికి సూపర్ సక్సెస్ అందించాయి. దీంతో సరిపోదా శనివారంతో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నారు. అంటే సుందరానికి చిత్రం తీసిన వివేక్ ఆత్రేయతో నానికి ఇది రెండో సినిమా కావడం విశేషం.