జగన్ లండన్ ప్రయాణం వాయిదా.. ఆ పాస్‌పోర్ట్ రద్దు చేయడంతో, ఏమైందంటే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి.. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ ‌రద్దుయ్యింది.. దీంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి.. ఏడాదికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఐదేళ్ల పాటూ పాస్‌పోర్ట్ ఇచ్చేలా చూడాలంటూ.. ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ జరగ్గా..
జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్టు జగన్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం చెబుతోంది.. దీంతో ఎన్‌వోసీ తీసుకోవాలని జగన్‌కు పాస్ పోర్ట్ కార్యాలయం సూచించింది. అయితే పాస్ పోర్ట్‌కు ఎన్‌వోసీ ఇవ్వాలని హైకోర్టును కోరారు జగన్ తరఫు లాయర్.. అయితే హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అయితే ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ లండన్ ప్రయాణం వాయిదా వేసింది. డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్‌లు ప్రధాని నుంచి ఎంపీల వరకు.. అలాగే ముఖ్యమంత్రులకు ఉంటాయి. అంటే వీరు ఎలాంటి వీసా లేకుండానే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొంతమంది ప్రముఖులకు కొన్ని దేశాలు డిప్లోమాటిక్ పాస్‌పోర్టులు జారీ చేస్తుంటాయని చెబుతున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *