వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం అన్ని వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలతలు పెరుగు తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. రోజూ గణపతి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రవి, బుధ, రాహు గ్రహాల అనుకూల సంచారంవల్ల ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలను, వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదంలో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్ప డుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలు తగ్గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవు తాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ముఖ్య మైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవ హారాల్లో ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అవకాశాలు కలిసి వస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుక్ర, బుధ, రవి గ్రహాల అనుకూలత కారణంగా అన్ని విషయాల్లోనూ, అన్ని ప్రయత్నాల్లోనూ వృద్ధి, పురోగతి ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తరచూ శివార్చన చేయించడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, బుధ, రవుల అనుకూల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు కూడా అనుకూలంగా, ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు అనుకో కుండా పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అయితే, వీటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. శివార్చన చేయించడం చాలా మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రవి, బుధులతో ధన స్థానం పటిష్ఠంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఉండవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. బంధువుల రాకపోకలు ఉండవచ్చు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికర స్థాయిలో ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. తరచూ శివార్చన చేయించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురు, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పనిభారం ఉండవచ్చు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధన యోగం ఉంది. తరచూ విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కుజ, శుక్ర, రాహు గ్రహాల సంచారం బాగున్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా నెరవేరుతుంది. ఉద్యోగంలో హోదా, వేతనాలు పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటాయి. పేరు ప్రఖ్యా తులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. వివాదాల విషయాల్లో తల్లితండ్రుల జోక్యం ఆశించిన ఫలితాలనిస్తుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు కొద్దిగా చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఘన విజయాలు లభిస్తాయి. ఈ రాశివారు లలితా సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులకు నమ్మకం ఏర్పడు తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో మంచి మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యో గం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సోదరులతో వివా దాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యా ర్థులు పురోగతి సాధిస్తారు. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రవి, బుధ, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సుఖప్రదంగా సాగిపో తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సం‍స్థలోకి మారే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. తరచూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, రాహు, గురు, బుధ, శుక్రుల శుభ సంచారం వల్ల ప్రయత్నపూర్వకంగానే కాక, అప్రయ త్నంగా కూడా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధా న్యం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి రాజీమార్గంలో పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ఆశించిన విజయాలు, సాఫల్యాలు లభిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్లు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక ఇబ్బందులుంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): బుధ, గురు, రవి గ్రహాల అనుకూలత వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అవస రానికి తగ్గట్టుగా డబ్బు వసూలు చేసుకుంటారు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగానే పెరిగి, ఆర్థిక సమ స్యలు తగ్గుముఖం పడపోతాయి. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. బంధు వులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని దోషం తగ్గుతుంది.

About rednews

Check Also

కుటుంబ జీవితంలో వారికి కొద్దిగా ఇబ్బందులు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2024): మేష రాశి వారికి ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *