ఏపీ ప్రజలకు బంపరాఫర్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉపయోగించుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు దసరా బొనాంజా ప్రకటించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతుబజార్లలో వంట నూనెలు, ఉల్లి, టమాటాలు విక్రయాలు ప్రారంభమయ్యాయి. పామాయిల్‌ లీటరు రూ.110కి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.124కు విక్రయిస్తున్నారు.. అలాగే కిలో టమాటా రూ.45, ఉల్లిపాయల్ని కూడా డిసౌంట్‌పై అందిస్తోంది. అలాగే రైతు బజార్లలో వినియోగదారులకు కనబడేలా బోర్డులు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలో పర్యటించారు. నగరంలోని పటమట, గురునానక్‌ కాలనీలోని రైతు బజార్లను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. అయితే రైతు బజార్ల ద్వారా నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కొంత ఖర్చు భరించి రాయితీపై వాటిని అందిస్తోందని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఉల్లి, టమాటాల నాణ్యత.. సరుకుల క్వాలిటీ, క్వాంటిటీని పరిశీలించారు. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో వంటనూనె అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు విక్రయిస్తున్నట్లుచ ెప్పారు. అలాగే ఈ నెలాఖరు వరకూ ఇదే ధరలపై విక్రయిస్తారని చెబుతున్నారు.

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను అధికరులు హెచ్చరించారు. రైతు బజార్లలో నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్నారు. బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు పామాయిల్ ,నూనె తక్కువ ధరకు అందిస్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో రేషన్‌ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందిస్తోంది. ప్రతి ఇంటికి రేషన్‌ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే రేషన్ పంపిణీ కొనసాగుతోంది.. బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార అందిస్తున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *