బిగ్‌బాస్ 7వ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. దాని కంటే ముందు ప్రోమో 2పై ఓ లుక్కేద్దాం. ప్రోమో 2లో ముందుగా తేజను నామినేట్ చేసింది యష్మీ. ఆయన నుంచి ఫన్ నేను అనుకున్నంత రాలేదు అంటూ యష్మీ చెప్పింది. దీనికి అవాక్కైన తేజ.. అసలు నేను మా క్లాన్‌తో ఎలా ఉన్నానో యష్మీకి తెలీనే తెలీదంటూ తేజ చెప్పాడు. అయితే బీబీ హోటల్ టాస్కులో తేజ క్యారెక్టర్ నుంచి బయటికొచ్చాడంటూ మరో రీజన్ చెప్పింది యష్మీ. దీనికి తేజ కామెడీ చేశాడు.
మరోవైపు నిఖిల్‌ను నామినేట్ చేస్తూ లాస్ట్ వీక్ నీ గ్రాఫ్ ఇలా పడిపోయిందంటూ చెప్పాడు మణికంఠ. దీంతో నీకెలా తెలుసురా నా గ్రాఫ్ పడిపోయిందని.. నువ్వు గ్రాఫ్‌లు గీశావా అంటూ వెటకారం ఆడాడు నిఖిల్. అంత వెటకారం ఆడకు.. బీబీ హోటల్ టాస్కులో నువ్వు ఇంకా కామెడీ చేయాల్సింది అంటూ మణికంఠ అన్నాడు. దీంతో అవునా మరి.. పులిహోర గురించి ఏదో చెబితేనే నువ్వు తీసుకోలేకపోయావ్.. నువ్వు నన్ను కామెడీ చేయమంటున్నావా అంటూ నిఖిల్ కౌంటర్ వేశాడు.
ప్రేరణపై పృథ్వీ కోపం
ఇక తర్వాత బీబీ హోటల్ టాస్కులో నువ్వు బాగా ఆడలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ. అందేటి అవ్వ నేను బాగానే ఆడాను మీ అసిస్టెంట్‌ను (నయని) అడగడండి అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి నయని ఏదో చెబుతుంటే గంగవ్వ కోపపడింది. ఇక గంగవ్వ, నిఖిల్ నామినేషన్స్‌లో గంగవ్వ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా అంటూ ప్రేరణ చెప్పింది. దీంతో ఎందుకు అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి ప్రేరణ చెప్పిన రీజన్ పృథ్వీకి నచ్చలేదు.
దీంతో వెంటనే యష్మీ దగ్గరికెళ్లి ప్రేరణ నామినేట్ కావాలి ఏం చేస్తారో చేయండి అంటూ పృథ్వీ అన్నాడు. తర్వాత ప్రేరణ మాట్లాడటానికి వచ్చినా నాతో మాట్లాడకు.. అంటూ పృథ్వీ ముఖం మీదే చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీని ఆపలేకపోతే కనీసం హరితేజను ఆపు అంటూ నిఖిల్‌ను సాయం అడిగింది ప్రేరణ. కానీ వెంటనే నిఖిల్ దగ్గరికొచ్చి నువ్వు ప్రేరణకి హెల్ప్ చేశావంటే తరువాత నీకూ నాకు పడుతుంది చూసుకో అంటూ పృథ్వీ వార్నింగ్ ఇచ్చాడు.
నామినేషన్స్ లిస్ట్ ఇదే
ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోయింది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు.
- పృథ్వీ
- నిఖిల్
- మణికంఠ
- నబీల్
- యష్మీ
- ప్రేరణ
- గౌతమ్
- తేజ
- హరితేజ
అయితే నామినేషన్స్‌లో నిజానికి హరితేజ లేదు. కానీ రాయల్ క్లాన్ వాళ్ల దగ్గరున్న షీల్డ్ పవర్‌తో హరితేజను నామినేషన్స్‌లోకి తెచ్చి అప్పటికే లిస్ట్‌లో ఉన్న అవినాష్‌ను తప్పించారు. దీంతో హరితేజ నామినేషన్స్‌లోకి రావాల్సి వచ్చింది.