టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఈ రంగాలకే ఫుల్ డిమాండ్!

Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్‌క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, హిమాలయన్, టాటా క్యూ, లైఫ్ స్టైల్ విషయానికి వస్తే.. తనిష్క్, టైటాన్, ఫాస్ట్‌ట్రాక్, ట్రెంట్, వెస్ట్ సైడ్, టెలికాం మీడియా రంగంలో టాటా ప్లే, తేజస్ నెట్‌వర్క్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలీ బిజినెస్ సర్వీసెస్ ఉన్నాయి.

వీటితో పాటు ఇంకా వివిధ రంగాల్లో టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా క్యాపిటల్, టాటా క్లిక్, క్రోమా, బిగ్ బాస్కెట్, తాజ్ హోటల్స్, ఎయిరిండియా, టాటా పవర్, టాటా హౌసింగ్, టాటా స్టీల్, టాటా ఏఐఏ లైఫ్ ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు మార్కెట్లో లిస్టయ్యాయి. చాలా స్టాక్స్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ఈ కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇంకా కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తూ.. ఉద్యోగాల్ని సృష్టిస్తూనే ఉంది.

ఇప్పుడు దశాబ్దాలకుపైగా టాటా గ్రూప్‌ను విజయవంతంగా నడిపి ఇటీవలే రతన్ టాటా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాల నుంచి ఇప్పుడే బయటపడుతూ.. టాటా గ్రూప్ తన కార్యకలాపాలవైపు దృష్టి సారించింది. రానున్న ఐదేళ్లలో తయారీ రంగంలో.. 5 లక్షల ఉద్యోగాల్ని టాటా గ్రూప్ సృష్టిస్తుందని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఛైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్, బ్యాటరీ, సెమీ కండక్టర్ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు రానున్నట్లు వివరించారు. ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సింపోజియంలో మంగళవారం రోజు ఆయన ఇలా మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే.. తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టి జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *