తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డూ. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అయింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక ఇదే సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు.

తిరుపతి లడ్డూ వివాదంపై ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనపై దయచేసి విచారణ జరపండి. దీనికి కారణం అయిన వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. అది పక్కన పెట్టి దేశంలో ఎందుకు ఆందోళనలు వ్యాపించేలా చేస్తున్నారు. ఈ సమస్యను దేశవ్యాప్తంగా ఎందుకు హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో కావాల్సినన్ని మతపరమైన ఘర్షణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాధాలు” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు.

ఇక పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యి వాడటం లేదని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటీవలె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు) కలిపినట్లు బయటపడిందని. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందాం. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దీనిపై అవసరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇది రాష్ట్రంలోని ఆలయాలు, వాటి భూములు, ఇతర ధార్మిక విధానాలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి వచ్చింది అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *