అనంతపురం: రూ.లక్షకు. రూ.4 లక్షలు.. అదిరిపోయే ఆఫర్.. చివర్లో అసలు ట్విస్ట్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త దందా మొదలైంది.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. రూ.లక్షలకు రూ.4 లక్షలంటూ ఎర వేస్తున్నారు.. అమాయకంగా వాళ్ల మాటలు నమ్మితే అంతే సంగతులు. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు కలకలంరేపింది. ఈ కేటుగాళ్ల మాయంలో పడి చిరువ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయి.

ధర్మవరంలో చేనేత వస్త్రాలు తయావుతాయి.. అందుకే బెంగళూరుతో పాటూ ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వస్తుంటారు. ఇక్కడ వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్‌లు ప్రింటర్స్‌ ద్వారా రూ.500, రూ.200 నోట్లను అచ్చం ఒరిజినల్‌ లాగా జిరాక్స్‌ తీసి రంగంలోకి దిగుతున్నారు. దళారుల్ని పెట్టుకుని రూ.లక్ష ఒరిజినల్‌ నోట్లు ఇస్తే రూ.4 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్ పెడుతున్నారు. ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో కొన్ని కూల్‌డ్రింక్స్, కిరాణా, ఎరువుల దుకాణాల్లో ఈ నోట్ల వ్యవహారం బయటపడింది.

ధర్మవరంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఈ నకిలీ నోట్లను మార్కెట్‌లోకి తెచ్చారు. వ్యాపారస్థులే టార్గెట్‌గా.. వస్తువులు, సరుకు కొనుగోలు చేసి దొంగ నోట్లను అంటగడుతున్నారు కేటుగాళ్లు. ఆ తర్వాత తాము మోసపోయామని షాపుల యజమానులు గుర్తిస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది కొన్ని ఘటనలు జరిగాయని చెబుతున్నారు. ఆ మధ్య కర్ణాటక పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశారు. బెంగళూరుకి చెందిన కొంతమంది వ్యక్తులు దళారుల ద్వారా కమీషన్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. ముదిగుబ్బలో కూడా ఈ నెల 13న నకిలీ నోట్లు బయటపడ్డాయి. కొన్ని కిరాణా, ఎరువుల షాపుల్లో ఈ నకిలీ నోట్లను వ్యాపారులకు అంటగట్టినట్లు సమాచారం. నకిలీ నోట్లకు సంబంధించి ఓ ఆడియో కూడా ఆ మధ్య వైరల్ అయ్యింది. నకిలీనోట్ల చలామణి చేసేవారిపై నిఘా పెడతామని చెబుతున్నారు పోలీసులు. ఈ నోట్లను తయారుచేసే వారి గురించి ప్రజలకు సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *