ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపు దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయగా వైఎస్సార్ పెన్షన్ కానుక స్కీమ్ ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది.
ఇప్పటివరకు 3,000 రూపాయల పింఛన్ పొందుతున్న వాళ్లు ఇకపై 4,000 రూపాయల పింఛన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ అమలు చేయనుండటంతో అర్హత ఉన్నవాళ్లు జులై 1వ తేదీన ఏకంగా 7,000 రూపాయల పింఛన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు దివ్యాంగులకు చంద్రబాబు పింఛన్ ను రెట్టింపు చేశారు. ప్రస్తుతం దివ్యాంగులకు 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం ఏకంగా 6,000 రూపాయలకు పెరిగింది.
పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వాళ్లు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్లు, వీల్ ఛైర్ లో ఉన్నవాళ్లకు 5,000 రూపాయల నుంచి పింఛన్ ఏకంగా 15,000 రూపాయలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు నెలకు పింఛన్ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెరిగింది. కుష్టు వ్యాధి వల్ల బహుళ వైకల్యం సంభవించిన వాళ్లకు నెలకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు.
కేవలం పింఛన్ల కోసమే ఏపీ ప్రభుత్వం ఏకంగా ఏడాదికి 33,099 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో టీడీపీ సర్కార్ పింఛన్లకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం అందుతోంది. త్వరలో మిగతా పథకాల గురించి కూడా టీడీపీ సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది.