ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల నుంచి పక్కా, చాలా తక్కువ ధరకే

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును తక్కువ ధరకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ.180 ఉండగా.. రైతు బజార్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో రూ.110కే అందిస్తున్నారు. అయితే నవంబర్ నెల నుంచి కందిపప్పు, పంచదారను బియ్యంతో పాటుగా పంపిణీ చేయనున్నారు. రెండు నెలల కిత్రం దీని కోసం టెండర్లు పిలవగా.. గత నెల నుంచి గోడౌన్‌లకు చేరుతోంది. నవంబరులలో రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు, పంచదార ఇవ్వబోతున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్లను కొత్తగా ఎంపిక చేసింది. సరుకులకు సంబంధించి కచ్చితమైన తూకం, నాణ్యమైన సరకు సరఫరా చేయనున్నారు. వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు చేపట్టారు అధికారులు. అలాగే పంచదారను కూడా రేషన్‌‌తో పాటుగా పంపిణీ చేస్తారు. చక్కెరను ఏఏవై కార్డుదారులకు కేజీ రూ.14, మిగిలిన వారికి అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. ఇకపై ప్రతీ నెలా కందిపప్పు నూరు శాతం కార్డుదారులకు అందిస్తామంటున్నారు అధికారులు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించింది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. ప్రభుత్వం రాయితీపై కిలో కందిపప్పును రూ.67కే అందించాలని నిర్ణయం తీసుకుంది. బయట మార్కెట్‌లో కిలో పంచదార రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది. నిత్యావసరాల ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మొన్న దసరా, ఈ నెలాఖరులో దీపావళి పండుగలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కందిపప్పు, చక్కెర మాత్రమే కాదు.. గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించే పనిలో ఉంది. జనవరి నుంచి ఈ సరకుల్ని కూడా రేషన్‌తో పాటుగా పంపిణీ చేయాలని భావిస్తోంది.

About rednews

Check Also

బోరుగడ్డ అనిల్ అరెస్ట్ వ్యవహారం.. హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్‌ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *