వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. ఏపీ హైకోర్టు సీరియస్, ఆ పదజాలంపై అభ్యంతరం

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తనకు భద్రత పెంచాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్‌లో జగన్‌కు మద్దుతగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడంపై సీరియస్‌గా స్పందించింది. జగన్‌ ఓవైపు తన భద్రత గురించి పిటిషన్‌ వేశాక.. మూడో పక్షం ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొందరు కోర్టుల్నిప్రచార వేదికలు, క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారని ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్లో వినియోగించిన పదజాలం సైతం అభ్యంతరకరంగా ఉందన్నారు. కోర్టు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని.. ప్రధాన పిటిషన్‌పై విచారణ అనంతరం ఇంప్లీడ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తామని, భారీ ఖర్చులు విధిస్తామన్నారు. తదుపరి విచారణలో ఈ ఇంప్లీడ్ పిటిషన్ వ్యవహారాన్ని వ్యవహారం తేలుస్తామని కోర్టు తెలిపింది.

తమకు మద్దతుగా ఎవరి ఇంప్లీడ్‌ పిటిషన్‌ అవసరం లేదని జగన్ తరఫు లాయర్ చెప్పారు. వెంటనే ఖాజావలి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. తాను జూన్ ముందుకు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది భద్రత సిబ్బందిని ఇచ్చారో.. అదే భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయగా.. సమాధానంగా రిప్లై అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలని జగన్‌ తరఫు లాయర్ కోరారు. దీంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని జగన్ ప్రధానంగా కోరారు. తనకు పర్సనల్‌ సెక్యూరిటీ అధికారులు(పీఎస్‌వోలు), కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రం తనకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పిస్తే.. తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించగా.. ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, స్టేట్‌ లెవల్‌ సెక్యూరిటీ రివ్యూ కమిటీ తరఫున హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తునట్లు కౌంటర్‌లో ప్రభుత్వం తెలిపింది. ఈ కేటగిరీ కింద మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది జగన్‌కు రక్షణగా విధుల్లో ఉన్నారని.. తాజా నివేదిక ఆధారంగా ఆయనకు జడ్‌ ప్లస్‌ కొనసాగించాలని సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. జగన్ 2014-19 మధ్య ప్రతిపక్షనేతగా ఉండగా జడ్‌ కేటగిరీ..2019లో ముఖ్యమంత్రి అయ్యాక జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని కల్పించారన్నారు. అయితే 2023లో ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారన్నారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని.. అదనపు భద్రతకు జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు అనర్హులని అందులో ప్రస్తావించారు. ప్రస్తుతం జగన్‌ ఓ ఎమ్మెల్యే మాత్రమేనని.. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు 1+1సెక్యూరిటీకి మాత్రమే అర్హులన్నారు. కానీ ఆయనకు ముప్పు ఉందని.. 2+2 సెక్యూరిటీకి మాత్రమే అర్హులన్నారు. అయినా సరే ప్రభుత్వం జగన్‌కు బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనంతో పాటు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తుందని కౌంటర్‌లో పేర్కొన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *