తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన …
Read More »అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా …
Read More »వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో స్వల్పంగా వివాదాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులకు స్థాన …
Read More »తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. అక్టోబర్ 3 నుంచే, వాటితో పని లేదు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల కార్డుల మంజూరుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులకు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, …
Read More »సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా …
Read More »యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా.. కాకినాడ కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు
దిగ్గజ సంస్థ, ఐఫోన్ ఉత్పత్తి కంపెనీ యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఐఫోన్ కొనుగోలు చేస్తే ఇయర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటన చూసి తాను మోసపోయాయని ఓ యువకుడు యాపిల్‌పై మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. ఫోన్ కొంటే తనకు ఇయర్ పాడ్స్ ఇవ్వలేని అతడు ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు …
Read More »దర్యాప్తు మొదలెట్టిన సిట్.. ప్రత్యేక వ్యూహంతో ముందుకు!
తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తులను కలవరపరిచాయి. ఈ అంశం మీద ఏపీలో చెలరేగిన రాజకీయ మంటలు సంగతి పక్కనబెడితే.. అందులో నిజానిజాలు వెలికితీసి, కారకులకు కఠినంగా శిక్షించాలని భక్తుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. …
Read More »వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం అన్ని వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు …
Read More »షేర్లు కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక ఆ ట్యాక్స్ మీరే కట్టాల్సిందే!
Share Buyback: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 1, 2024 నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త బైబ్యాక్ ట్యాక్స్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపులు కంపెనీల నుంచి షేర్ హోల్డర్లకు తర్జుమా కానుంది. షేర్ల బైబ్యాక్ (Buy Back) చేసినప్పుడు ఇన్నాళ్లు కంపెనీలు ట్యాక్స్ కడుతుండగా.. ఇప్పుడు ఆ ట్యాక్స్ షేర్ హోల్డర్లు కట్టాల్సి ఉంటుంది. ఇది మూలధన పంపిణీ, పెట్టుబడి వ్యూహాల కోసం కంపెనీలు అనుసరించే విధానాన్ని ప్రాథమికంగా మార్చనుంది. ఈ …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఆ సేవ కూడా!
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. అక్టోబర్ 1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల ఆలయంలో మంగళవారం (అక్టోబరు 1) రోజున ఆలయ శుద్ధి నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) టీటీడీ రద్దు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించి నిర్వాహకులకు సహకరించాలని …
Read More »