తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే నవనీత సేవ మధ్యాహ్నం …
Read More »ఏపీలో పింఛన్లు తీకునేవారికి అలర్ట్.. ఇకపై వాళ్లకు అకౌంట్‌లలో డబ్బులు జమ, ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం.. ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది. ప్రతి నెలా వీరు పింఛన్ తీసుకునేందుకు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.. అందుకే వారికి పింఛన్ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ …
Read More »ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో స్థిరత్వం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ఉద్యోగం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థి తులుంటాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, కార్యక్రమాలు …
Read More »తెలంగాణకు భారీ వర్ష సూచన.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ …
Read More »ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఎలాన్ మస్క్ డేటింగ్.. వైరల్ ఫోటోపై ట్విటర్ అధినేత క్లారిటీ
Elon Musk: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుండటంతో మస్క్, మెలోనీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇదే సమయంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎలాన్ మస్క్.. జార్జియా మెలోనీపై ప్రశంసల వర్షం కురిపించడంతో వీరిద్దరూ …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు అల్పపీడనం …
Read More »వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ చలాన్లు ఎక్కువగా ఉన్నాయా, అయితే షాక్!
Traffic Violations: రోడ్లపై ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నా కొందరు వాహనదారులు మాత్రం దారికి రావడం లేదు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ వేల రూపాయల ఫైన్లు బండిపై ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి.. వాహనదారుల నుంచి ట్రాఫిక్ చలాన్ల సొమ్ము వసూలు చేస్తున్నాయి. తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన పంపించారు. ట్రాఫిక్ చలాన్లు …
Read More »రేవంతన్నా నీకిది న్యాయమా..? ‘హైడ్రా’ కూల్చివేతలపై సీఎం డైహార్ట్ ఫ్యాన్ ఆవేదన
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. బడాబాబులు, డబ్బున్నోళ్ల ఇండ్లను వదిలేసి మధ్యతరగతి, పేదల ఇండ్లను కూల్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల నోట్లో మట్టి కొడుతున్నారని.. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలోని పటేల్‌గూడలో ఆదివారం (సెప్టెంబర్ 22)న హైడ్రా పలు విల్లాలు, ఇండ్లు కూల్చేసింది. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశాడు. …
Read More »ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది.మరీ ముఖ్యంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. ఏపీలో నూతన విమానాశ్రయాల గురించి కీలక …
Read More »ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా …
Read More »