బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటాలదాడి మాములుగా లేదు. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియకి సరికొత్త థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ-ప్రేరణపైన ఆధారపడి ఉంటుంది.. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్‌ను (టోపీ) పట్టుకోవాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే హ్యాట్‌ను ఎవరైతే పట్టుకుంటారో వారి దగ్గర నామినేట్ చేసే పవర్ ఉంటుందన్నమాట.
గౌతమ్ Vs అవినాష్
ఇక ప్రోమోలో ముందుగా రోహిణి, నిఖిల్ తమ నామినేషన్స్ చెప్పేందుకు ముందుకు వచ్చారు. రోహిణి.. గౌతమ్‌ను నామినేట్ చేసింది. చక్కగా ఫ్లోలో ఫన్ టాస్కు వెళ్తుంటే తన ఎమోషన్స్ హర్ట్ అయింది ఓకే.. కానీ ఆ కోపాన్ని మైక్ మీద చూపించడం నాకు నచ్చలేదు.. అంటూ రోహిణి చెప్పింది. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ కామెడీ అయినా ఏదైనా నాపైన చేస్తే అది బుల్లీయింగ్ (రెచ్చగొట్టడం) కిందకే వస్తుంది అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి అది చాలా పెద్ద పదం గౌతమ్.. అయినా ఫన్ టాస్కులో వాడు ఒక మాట ఎవరూ ఫీల్ కావద్దని చెప్పే కామెడీ చేశాడు అంటూ నిఖిల్ సమాధానమిచ్చాడు.