దెబ్బకి దిగొచ్చిన పల్లవి ప్రశాంత్.. రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం

ఇచ్చిన మాట తప్పిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని నెటిజన్లు నిలదీయడంతో దెబ్బకి దిగొచ్చాడు. తనని బిగ్ బాస్ విన్నర్‌గా గెలిపిస్తే ప్రైమ్ మనీ మొత్తం పైసలతో సహా.. రైతులకు పంచిపెడతానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా ప్రమాణం చేసిన పల్లవి ప్రశాంత్.. ఒక పేద కుటుంబానికి మాత్రమే సాయం చేసి ఆ తరువాత ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభానికి రెడీ అవుతుంది కానీ.. తాను ఇచ్చిన మాటని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు పల్లవి ప్రశాంత్.

అయితే సోషల్ మీడియాలో మాత్రం.. జై జవాన్ జై కిసాన్ అంటూ అదిగో వచ్చేస్తున్నా.. ఇదిగో ఇచ్చేస్తున్నా అని వీరలెవల్లో ఎలివేషన్స్ వీడియోలు పెడుతున్నాడు తప్పితే.. చేస్తానన్న సాయం మాత్రం చేయడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు, బిగ్ బాస్ ఫాలోవర్స్, ఇతర నెటిజన్లు పల్లవి ప్రశాంత్‌ని ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశారు. రైతులకు చేస్తానన్న సాయం ఇంకెప్పుడు చేస్తావ్ అని నిలదీశారు.

దీంతో దిగొచ్చిన పల్లవి ప్రశాంత్.. ఓ పేద రైతు కుటుంబానికి రూ.20 వేలు ఆర్ధికసాయం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నేనున్నా.. జై జవాన్ జై కిసాన్’ అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్.

మెదక్‌‌లోని చిన శంకరపేట్‌కి చెందిన పరమేశ్వర్ (32) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అతనికి భార్య శంకరమ్మతో పాటు.. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబానికి ఆధారంగా ఉన్న భర్త చనిపోవడంతో శంకరమ్మ.. తన ముగ్గురు ఆడ బిడ్డలను పెంచడం కష్టంగా మారింది. అయితే పేద రైతులకు సాయం చేస్తానని మాట ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. శంకరమ్మ ఇంటికి వెళ్లి.. రూ.20 వేలు ఆర్ధికసాయం అందించారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *