కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …
Read More »అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..
పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …
Read More »వినేష్ ఫొగాట్‌కు బిగ్ షాక్.. రజత పతకం చివరి ఆశలు కూడా గల్లంతు
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్ పారిస్ …
Read More »యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్
రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …
Read More »రూ.12.5 కోట్ల విలువైన చికెన్ దొంగతనం.. మహిళకు 9 ఏళ్ల జైలు శిక్ష
Chicken Wings: మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. అప్పుడు వాళ్లు కూడబెట్టిన ఆస్తులు చూస్తే.. వారి జీతానికి, ఆస్తులకు సంబంధమే ఉండదు. అయితే ఇలా దొరికిపోయిన వారిపై కేసులు, శిక్షలు అంటూ పెద్ద తతంగం ఉంటుంది. అయితే విద్యార్థులకు అందాల్సిన చికెన్ ముక్కలను కొట్టేసిన ఓ మహిళ.. చివరికి కటకటాల వెనక్కి …
Read More »మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్.. అంతర్జాతీయ సమాజం ఆందోళన
ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ …
Read More »కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …
Read More »స్వింగ్ స్టేట్స్లో కమలా హ్యారిస్ దూకుడు.. పోల్ సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యం
గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం నుంచి అనూహ్యంగా జో బైడెన్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీకి వచ్చారు. ఆగస్టు 19న జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమలా పేరును లాంఛనంగా ప్రకటించున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండగా.. డెమొక్రాట్లకు అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ …
Read More »మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ
షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …
Read More »హసీనాకు రక్షణగా రఫేల్ జెట్లు పంపి.. విమానానికి భద్రత కల్పించిన భారత్
రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు …
Read More »