అమరావతి

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రేసులోకి అనూహ్యంగా ఆయన.. ఈ సారి ఛాన్స్ ఆ జిల్లాకేనా?

నామినేటేడ్ పోస్టులు సహా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదవుల భర్తీపై ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించారు. పొలిట్ బ్యూరో సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమయంలోనే మరో కీలక పదవిని రాయలసీమకు చెందిన ఆ నేతను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా …

Read More »

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్.. ఆ రోజే చంద్రబాబు రివ్యూ.. ఆ డేట్ ఫిక్సా?

ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి …

Read More »

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్‌ చేసిన వాలంటీర్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపులను తక్షణమే డిలీట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్‌ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్‌ గ్రూపులను, …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. జులై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో పింఛన్ల పంపిణీకై టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్ట్ నెల ఒకటో తేదీనే 99 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99 శాతం మందికి …

Read More »

ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …

Read More »

జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు.. 

జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ సమాచారం అందించారు. పార్టీ చీఫ్‌ విప్‌‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్భులుగా విశాఖ సాత్‌ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ , రాజోలు ఎమ్మెల్యే …

Read More »

ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

Read More »

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …

Read More »

ఏపీని వణికిస్తున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు విస్తాయంటున్నారు. ఇవాళ …

Read More »