క్రీడలు

పాకిస్థాన్‌కు టీమిండియా రావొద్దు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ ఏర్పాట్లు చకచకా చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. కొందరేమో.. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కకు పెట్టి ఆటకోసమైనా భారత్.. పాక్‌కు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్థాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ …

Read More »

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్‌లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం. పంజాబ్ …

Read More »

వినేష్‌ ఫొగాట్‌కు బిగ్ షాక్‌.. రజత పతకం చివరి ఆశలు కూడా గల్లంతు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్‌ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వినేష్‌ ఫొగాట్‌ చేసిన అప్పీల్‌ను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్‌ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్‌ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్‌ పారిస్‌ …

Read More »

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓటమి.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ.. వైరల్ వీడియో

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని విద్యార్థులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి చెప్పు తీసుకుని కొట్టాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన సదరు పీఈటీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి …

Read More »

పారిస్‌ ఫైనల్‌ మెడల్స్ లిస్ట్‌.. టాప్‌లో అమెరికా, భారత్‌ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్..!

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్‌ తొలి మెడల్‌ సాధించి జోష్‌ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు …

Read More »

వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్

ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …

Read More »

 ‘మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!’ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

ప్యారీస్‌ ఒలంపిక్స్‌ 2024లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. వినేశ్‌ ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read More »

రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగింది? లక్షల్లో జీతం తీసుకునే కోచ్‌లు ఏం చేస్తున్నారు?

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఫైనల్‌ చేరిన వినేష్‌ ఫొగాట్‌ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్‌ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్‌ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్‌ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్‌ ఫొగాట్‌కు మద్దతు ప్రకటించారు. రౌండ్‌ 16, క్వారర్స్‌, సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు వినేష్‌ ఫొగాట్‌ బరువు …

Read More »

భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం.. 27 ఏళ్ల తర్వాత సిరీస్‌ కోల్పోయిన భారత్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ కాంబోలో ఆడిన తొలి వన్డే సిరీస్‌ను భారత్‌ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో 0-2తో భారత్‌ ఓడిపోయింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాటర్ల వైఫల్యంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ గెలవలేకపోయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో …

Read More »

ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు, పతకం లేకుండానే!

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్‌ …

Read More »