ఉత్తర్ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు …
Read More »చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!
చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్.. …
Read More »బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!
Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …
Read More »రూ.12.5 కోట్ల విలువైన చికెన్ దొంగతనం.. మహిళకు 9 ఏళ్ల జైలు శిక్ష
Chicken Wings: మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. అప్పుడు వాళ్లు కూడబెట్టిన ఆస్తులు చూస్తే.. వారి జీతానికి, ఆస్తులకు సంబంధమే ఉండదు. అయితే ఇలా దొరికిపోయిన వారిపై కేసులు, శిక్షలు అంటూ పెద్ద తతంగం ఉంటుంది. అయితే విద్యార్థులకు అందాల్సిన చికెన్ ముక్కలను కొట్టేసిన ఓ మహిళ.. చివరికి కటకటాల వెనక్కి …
Read More »ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓటమి.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ.. వైరల్ వీడియో
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని విద్యార్థులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి చెప్పు తీసుకుని కొట్టాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన సదరు పీఈటీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి …
Read More »నెమలికూర వంటకాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.. కట్ చేస్తే..
సోషల్‌మీడియాలో పాపులారిటీ .. యూట్యూబ్ హిట్స్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు కొందరు. అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ కొందరు ప్రమాదాల్లో పడుతుంటే.. మరికొందరు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా …
Read More »జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు.. కొనసాగుతున్న ఆపరేషన్
గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం దేశం మొత్తం తీవ్ర ఆందోళనకరంగా మారాయి. సరిహద్దుల నుంచి దేశంలోని ఉగ్రవాదులు చొరబడటం, ఇక్కడ ఉన్న ఉగ్రవాద మద్దతుదారులు రెచ్చిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉగ్రవాద దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం సంచలనంగా మారుతోంది. తాజాగా జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయాల పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య …
Read More »మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. నిందితులకు ఉరిశిక్ష వేస్తామన్న సీఎం
Junior Doctor: పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై …
Read More »భారీ ఉగ్రకుట్ర భగ్నం.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాది
Independence Day: దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉగ్రవాది వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పంద్రాగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు ఉగ్రవాదులు తెరలేపగా.. వాటిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది.. భారత ప్రభుత్వం వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. అతడి కోసం వెతుకుతుండగా.. తాజాగా ఢిల్లీలో ఆయుధాలతో పట్టుబడటం తీవ్ర …
Read More »ఏపీ ప్రజలకు అలర్ట్.. పథకం ప్రారంభం కాక ముందే ఇదేం తలనొప్పి.. జాగ్రత్తగా ఉండండి
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను …
Read More »