చిత్తూరు

దేవుడా నువ్వే దిక్కు.. సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుకల సంసారం..! ఆలయ ట్రస్ట్‌ వివరణ..

ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారు భక్తుల కొంగుబంగారం. శ్రీవారి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. ఓ వైపు ప్రసాదం తయారీలో …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

మాజీ మంత్రి రోజాకు చిక్కులు.. రంగంలోకి సీఐడీ, ఆ మాజీ మంత్రి కూడా!

మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు.. గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

టీడీపీకి షాక్.. క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గానూ ఐదింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం ఐదు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాల అనంత‌రం ఎస్వీ కాంప్లెక్స్ వ‌ద్ద ఉన్న వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి మేయ‌ర్ బీవై రామ‌య్య, మాజీ ఎమ్మెల్యే …

Read More »

ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

Read More »

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …

Read More »

ఏపీని వణికిస్తున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు విస్తాయంటున్నారు. ఇవాళ …

Read More »

ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక..

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు స్టాపేజీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 40 రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఆగనున్నాయి. రైల్వే అధికారులు దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా ఆయా రైళ్లలో కొత్త హాల్ట్‌లు ప్రారంభమవుతాయి. ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్‌లో.. …

Read More »

బీజేపీ ప్రతినిధులకు చంద్రబాబు విందు: సీఎం కుప్పం పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. జూన్ 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. …

Read More »