విశాఖపట్నం

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బదులుగా.. కేంద్రం కొత్త ప్లాన్!

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. …

Read More »

విశాఖపట్నం వ్యక్తికి క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్.. ఆ కారుకు ఖర్చు మొత్తం భరిస్తానని హమీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సామాన్యుడు చేసిన ట్వీట్‌కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.. అయితే మంత్రి కాన్వాయ్‌లోని వాహనం రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని భరద్వాజ్ ఎక్స్ ( ట్విట్టర్)‌లో లోకేష్‌కు చెప్పారు. …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన …

Read More »

విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఛార్జీల వివరాలివే.. 60 కిమీ దూరానికి ఎంతో తెలిస్తే!

విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలపై క్లారిటీ వచ్చింది.. అయితే ఈ ఛార్జీలు సామాన్యులకు కాస్త భారంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60 కిలోమీటర్ల దూరానికి వందేభారత్‌లో ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.435 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.820గా ఛార్జీలు ఉన్నాయి. అదే సాధారణంగా ఆర్టీసీ డీలక్స్‌ బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. ఇలా చూస్తే.. వందేభారత్‌లో నాలుగు రెట్లు అధికం అంటున్నారు. విశాఖపట్నం నుంచి వందేభారత్‌ రైలు ఛార్జీల వివరాలు ఇలా …

Read More »

విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!

విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ (FTI-TTP)ను కేంద్ర …

Read More »

వైఎస్ జగన్‌తో సెల్ఫీ.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు చిక్కులు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్‌ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …

Read More »

విశాఖ ఎయిర్‌పోర్టులో కొత్త సేవలు.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే..

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, పట్నా, గోవా, కోయబత్తూరు సహా 9 చోట్ల డిజి యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. …

Read More »

విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఫోన్ కాల్‌తో ఆగిపోయిన విమానం, ఎంత పని చేశావు నాయనా!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది. ఒక ఫోన్ కాల్‌తో విమానం ఆగిపోగా.. అధికారులు, భద్రతా సిబ్బంది కొద్దిసేపు పరుగులు పెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు.. ఆ విమానం ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడి విమానాన్ని కాసేపు ఆపేందుకు ఇలా చేసినట్లు తేలింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరింది. అక్కడ విమానం ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. ఎలాగైనా …

Read More »

విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్

విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …

Read More »