విశాఖపట్నం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎదురు దెబ్బ.. అన్నంత పనిచేసిన చంద్రబాబు సర్కార్

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పినట్లుగానే జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు వస్తున్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు.. సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని.. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు చెబుతున్నారు. భీమిలిలోని సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన …

Read More »

విశాఖ: కడుపునొప్పితో వచ్చిన మహిళకు స్కానింగ్.. రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్, వామ్మో ఎలా సాధ్యం

విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్‌ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు అవాక్కయ్యారు.. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్‌ కోసం ఆమె మందులు వాడారు. ఆ తర్వాత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో …

Read More »

తెలుగు ప్రజలకు అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు చేశారు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నెరవేరనున్న ఏళ్ల నాటి కల.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Railway Zone: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ.. ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఒకప్పుడు అవన్నీ కలలుగానే ఉండగా.. రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడే అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు కానుందని రైల్వేశాఖ మంత్రి …

Read More »

గంజాయికి అవకాడోతో చెక్.. ఎకరాలో పండిస్తే ఇంత లాభమా? ఐడియా అదిరింది గురూ

మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …

Read More »

సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో ఇక్కడ కూడా, ఇకపై ఈజీగా

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దిగ్విజయంగా కొనసాగుతున్న నిత్య అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకు డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సింహాద్రి అప్పన్న స్వామి నిత్యాన్నప్రసాద పథకం 35వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నప్రసాద పథకానికి సాధారణ భక్తులు సైతం విరాళాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహాచలం ఆలయం అన్నదానం భవనం దగ్గర కార్డు స్వైపింగ్‌ పరికరాలు, డిజిటల్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. …

Read More »

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. డైనో పార్కులో మంటలు

విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్‌ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …

Read More »

చంద్రబాబు నిర్ణయంతో బొత్స సత్యనారాయణకు జాక్‌పాట్.. అనుకున్నదే అయ్యిందిగా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా …

Read More »

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. 3 నెలల్లో ఆస్తులు పెరిగాయి

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 1.45 గంటలకు 3 సెట్ల పత్రాలను పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్‌ అధికారి కె మయూర్‌ అశోక్‌కు అందజేశారు. నామినేషన్ సమయంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్‌ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నారు. బొత్స సత్యనారాయణ వెంట మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, విశాఖ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, …

Read More »