ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు మొదలయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొత్త షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా షాపుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మందుబాబులో బ్రాండెడ్ లిక్కర్ కొనుగోలు చేయడం కనిపించింది. బుధవారం ఉదయం నుంచే మందుబాబులు కొత్త షాపుల దగ్గర బారులు తీరారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ షాపుల్లోని పాత సరుకును అధికారులు లెక్క చూసి డిపోలకు పంపించారు. బుధవారం ఉదయం నుంచి కొత్త స్టాక్‌ను ప్రైవేటు షాపులకు తరలించారు. అన్ని షాపులకు …
Read More »ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు, వివరాలివే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల్ని నియమించడానికి సుప్రీం కోర్టు కొలీజియం పేర్లను సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌ల పేర్లతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించారు. అయితే ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే …
Read More »‘బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. వాళ్లు చెబితేనే చేశా’ భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్
నంద్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నంద్యాల విజయ డెయిరీకి వెళ్లిన ఆమె.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న శిలాఫలకాన్నే కాలువలో పడేయడంపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నంద్యాలలో పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడు తొలగించి కాలువపై వేయడంపై మండిపడ్డారు. …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. మొత్తానికి ఆ ఫైల్ కదిలింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఫైల్ కదిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణా కేసుల వివరాలను తనకు పంపాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లాస్థాయి అధికారులంతా ఉద్యోగులపై నమోదైన కేసులను తక్షణమే సమీక్ష చేయాలని.. పెండింగ్ కేసుల వివరాలతో ఒక నోట్‌ను తనకు పంపాలంటూ సీఎస్ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ నీరబ్‌కుమార్ మెమో జారీ చేశారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసులను సంబంధిత శాఖ కానీ, …
Read More »ఏపీలో మందుబాబులకు పండగ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ప్రభుత్వం చాలా తక్కువకే!
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు కేటాయించింది. నేటి నుంచి మందుబాబులు …
Read More »మహిళలూ బీ రెడీ.. రేపే మంత్రివర్గ సమావేశం.. ఆ శుభవార్త ఖాయం!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీషెడ్యూలులో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల …
Read More »ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే పోటీ చేయను.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గత కొంతకాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నాయని.. అలాగే మన దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ఇక హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ …
Read More »లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర …
Read More »