జాతీయం

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలపై ప్రకటన.. వరుసగా పడిపోతున్న అంబానీ స్టాక్.. ఈసారి ఎన్ని వేల కోట్లో?

దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి. చాలా సబ్సిడరీలు ఉన్నాయి. ఆయిల్ నుంచి రిటైల్ వరకు టెలికాం నుంచి విద్యుత్ వరకు చాలానే సంస్థలు ఉన్నాయి. ఇక అంబానీ ఎప్పుడో తన సంతానానికి.. పలు విభాగాల బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం అంబానీ తనయ ఇషా అంబానీ చూసుకుంటుండగా.. రిలయన్స్ టెలికాం బాధ్యతల్ని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ …

Read More »

ఉచిత రేషన్ పరిధిని పెంచిన మోదీ సర్కార్.. దాని ప్రయోజనం ఎలా, ఎవరికి లభిస్తుందో తెలుసా!

భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. వివిధ వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలు తీసుకువస్తోంది. భారతదేశంలో ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. కడుపు నిండా తిండి లేనివారి ప్రభుత్వం సహాయం అందజేస్తుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని …

Read More »

9 రోజులు వేతనంతో కూడిన సెలవులు.. ఉద్యోగులకు ‘మీషో’ ఆఫర్!

Meesho: ఏ రంగంలో పని చేస్తున్న వారైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కొంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి నుంచి తమ ఉద్యోగులకు విశ్రాంతి ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో. తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది ఈ సెలవుల్లో పూర్తి విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ …

Read More »

దేశంలో పెరిగిన బియ్యం ధరలు.. మోదీ సర్కార్ నిర్ణయంతో సామాన్యులపై భారం

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో దేశంలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే బియ్యం ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక ఇప్పటికే కూరగాయలు, వంటనూనె, ఇతర నిత్యావసరాల వస్తువుల ధరలు మండిపోతున్న వేళ.. తాజాగా బియ్యం ధరలు కూడా పెరగడంతో పండగల వేళ జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే గతేడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు …

Read More »

Tata Group: 6 ఖండాలు.. 100 దేశాలు.. 30 కంపెనీలు.. ‘టాటా’ల వారసత్వాన్ని శిఖరాగ్రాలకు చేర్చిన దిగ్గజం!

Tata Group: రతన్ టాటా.. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అయినా ఏ రోజునా సంపన్నులతో కలిసి కనిపించలేదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత నిరాడంబరుడు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌నకు చెందిన 30 కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు. అయినప్పటికీ అత్యంత అసాధారణ జీవితాన్ని గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతలు అందుకున్న ఆయన.. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా పేరుగాంచారు. 1937, డిసెంబర్ 28న జన్మించిన …

Read More »

ఆయన మరణం దేశానికి తీరనిలోటు’.. రతన్ టాటాకు పారిశ్రామిక దిగ్గజాల నివాళి!

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం టాటా గ్రూప్‌కే కాదు, దేశ ప్రజలకు తీరని లోటన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రతన్ టాటాతా తనకు ఉన్న అనుబంధం, ఇద్దరూ కలిసి పంచుకున్న అనేక విషయాలు, ఆయన వ్యక్తిత్వం తనలోని స్ఫూర్తిని, తనకు …

Read More »

బీఎస్‌ఎన్‌ఎల్‌ నెక్ట్స్‌ లెవల్‌ అంతే.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్‌.. Airtel తర్వాత BSNL మాత్రమే!

BSNL Selfcare App : జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్లు పెండటంతో.. ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఊపందుకుంది. ఇతర నెట్‌వర్క్‌ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ పెట్టుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లను సైతం అందిస్తోంది. అంతే కాకుండా.. వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ప్లాన్‌లను కూడా తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌పై నిరంతరం పని చేస్తోంది. ఎలాగైనా.. ఈ ఏడాది చివరి …

Read More »

నేడు ప్రధానితో సీఎం భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ స్టీల్‌ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో హస్తినకు బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా మంత్రి నితిన్‌ …

Read More »

సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఆప్ ఎంపీ ఇంట్లో మకాం

Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌.. ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి ఖాళీ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. కొన్ని రోజుల క్రితమే బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే తాను ప్రజాకోర్టులో గెలిచి.. మళ్లీ సీఎం పదవిలో కూర్చుంటానని.. అప్పటివరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఇటీవలె ఎన్నిక కాగా.. …

Read More »

మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు.. సుప్రీంకోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట

ఈశా ఫౌండేషన్‌‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈశా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై …

Read More »