Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ …
Read More »ఇకపై సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లు.. సిగ్నల్ లేకపోయినా కాల్స్, ఇంటర్నెట్..?
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. ఈ క్రమంలోనే వివో, జియోమి, హువాయ్ వంటి మొబైల్ తయారీ సంస్థలు త్వరలో ఎలాంటి నెట్‌వర్క్ లేకుండా పనిచేసే మొబైల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు అడవిలో ఉన్నా లేదా పర్వతాలపై ఉన్నా నెట్‌వర్క్ అవసరం లేదు. ఎలాంటి నెట్‌వర్క్ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కంపెనీలు తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత …
Read More »వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!
Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …
Read More »గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి అలర్ట్.. ఆ బ్యాంక్ UPI సేవలు బంద్.. షెడ్యూల్ టైమ్ ఇదే!
Maintenance Schedule: మన దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణా ప్రాంతాల్లోనూ యూపీఐ పేమెంట్స్ భరీగా పెరిగాయని చెప్పవచ్చు. ఇతర దేశాలకు సైతం యూపీఐ సేవలు విస్తరించాయంటే ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే యూపీఐ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి …
Read More »అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. మొబైల్స్‌పై 40 శాతం డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్‌లో పొందొచ్చు!
స్మార్ట్‌ఫోన్, టీవీలపై డిస్కౌంట్ ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సంస్థ.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) నిర్వహించనుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, …
Read More »క్రెడిట్ స్కోరు తక్కువుందా.. లోన్ అస్సలు రావట్లేదా? ఈ అపోహలు వీడితేనే తక్కువ వడ్డీకి రుణాలు!
లోన్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రం వడ్డీలో రాయితీ ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి స్కోరు సాధించే క్రమంలోనే క్రెడిట్ స్కోరుపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. వీటిని వీడాల్సిన అవసరం ఉంది. చాలా మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే.. వారి వారి అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటున్నారు. కార్డు తీసుకోగానే మురిసిపోవద్దు. దానిని సరిగ్గా నిర్వహించగలగాలి. సమయానికి బిల్లు చెల్లించగలగాలి. …
Read More »దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు..
కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఉన్న సాంకేతికతో అధునాతన సౌకర్యాలతో కోచ్‌లు, సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. కొత్త రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్ల తీర్చిదిద్దుతోన్న కేంద్ర ప్రభుత్వం.. వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.. ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేస్తున్నాయి. కాగా, వందేభారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు కేవలం మూడు స్టేషన్లలో …
Read More »ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే..
కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ …
Read More »రియల్‌మీ జీటీ 6టీ వచ్చేస్తోంది.. ఈనెల 20 నుంచి సేల్స్ ప్రారంభం
Realme GT 6T Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. రియల్‌మీ జీటీ 6టీ (Realme GT 6T) పేరిట మరో ఫోన్‌ను కలర్ ఆప్షన్‌లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్‌మీ తన రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. ఈఏడాది మే నెలలో రియల్‌మీ జీటీ 6టీ …
Read More »ఐటీ ఉద్యోగులకు అలర్ట్..అటెండెన్స్‌తో లీవ్స్‌కి లింక్
IT Employees: దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆఫీసు అటెండెన్స్‌తో సెలవులకు లింక్ పెట్టింది. అంటే ఆఫీసుకు వచ్చిన వారికి మాత్రమే లీవ్స్ ఉంటాయి. ఆఫీసుకు రాని వారికి శాలరీలో కోత పడనుంది. ఈ మేరకు ఈ విషయానికి సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు మనీకంట్రోలో ఓ కథనం ప్రచురించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత …
Read More »