పాలిటిక్స్

వైసీపీకి మరో బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ గుడ్ బై, ఆయనకు జగన్ పదవి ఇవ్వడంతో ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పద్మ ఇవాళ అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలను ఆమె వెల్లడించే అవకాశంఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ …

Read More »

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టులు.. వైసీపీ నేత అరెస్ట్, ఆ వెంటనే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు. ఆగస్టు 17న టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ అసిలేటి నిర్మల ఇంటూరి రవికిరణ్‌పై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై తీవ్ర అసభ్య పదజాలంతో అసభ్యకరంగా కార్టూన్లు సృష్టించి …

Read More »

జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అన్న మీద బాణాలు వదులుతున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వైసీపీపైనా అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలనతో పాటుగా గత వైసీపీ పాలనను కూడా షర్మిల ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై షర్మిల.. ప్రస్తుత, గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. …

Read More »

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం?

Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం.. బీజేపీ సీఎంలను పక్కన పెట్టి మరీ..!

Chandrababu: హర్యానాలో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార మహోత్సవం.. చండీగఢ్‌లోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు 18 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో కింగ్ మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. …

Read More »

సీఎం చంద్రబాబును ఆ ఒక్క విషయంలో స్వాగతిస్తున్నాం: వైఎస్ షర్మిల

ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు గాలికి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. వాటి స్థానంలో కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారని అనుకున్నామని చెప్పారు. మహిళలకు శుభవార్త చెబుతారనుకుంటే.. మెుండి చేయి చూపారని ఫైరయ్యారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తాం అన్నారు. 20 లక్షల …

Read More »

టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు …

Read More »

వైసీపీకి బిగ్ షాక్.. అనుకున్నదే జరిగింది, టీడీపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా షాక్‌లు తప్పడం లేదు. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పార్టీకి, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌ రావు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో.. మోపిదేవి, మస్తాన్ రావులు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు …

Read More »

నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ …

Read More »

మంత్రి కొండా సురేఖ వివాదం.. కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. అయితే.. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. గురువారం (అక్టోబర్ 03న) రోజు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు.. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ …

Read More »