Business

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

నెలకు రూ. 3 వేలు చాలు.. ఇలా చేతికి రూ. 34 లక్షలు.. వడ్డీ లేకుండానే రూ. 30 లక్షల లోన్!

SIP Calculator: స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఉంటంటాయి. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో సెన్సెక్స్ రోజుకు 1000, 2000 పాయింట్ల మధ్య కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒక్కసారిగా పడిపోవడం.. మళీ 2-3 రోజుల్లోనే కోలుకోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తం లేదా షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇదే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో చూసినట్లయితే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ …

Read More »

యూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. చెక్ క్లియరెన్స్ గంటల్లోనే!

RBI Governor Cheques Clearance: ఈసారి కూడా అందరి అంచనాలకు అనుగుణంగానే.. అంతా ఊహించినట్లుగానే రెపో రేట్లను మార్చలేదు. దీంతో వరుసగా 9వ సారి కూడా ఈ రేట్లను యథాతథంగానే ఉంచింది. మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం.. ఏప్రిల్, మే …

Read More »

ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌.. స్మార్ట్‌టీవీలు, Apple iPhone, Google, Samsung ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు

Flipkart Flagship Sale 2024 : స్వాతంత్య్రదినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు ఈ Flagship Sale ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్‌ ఉత్పత్తులపై …

Read More »

రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త.. మరిన్ని రివార్డ్ పాయింట్లు.. యూపీఐ లావాదేవీలపైనా..!

Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. అందులో యూపీఐ ట్రాన్సాక్షన్ల వాటానే అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్లు చేసేందుకు రూపే క్రెడిట్ కార్డులకు అవకాశం కల్పించింది కేంద్రం. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ఎన్‌పీసీఐ కీలక సూచన చేసింది. ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డు పాయింట్లు, ఇతర బెనిఫిట్స్ రూపే క్రెడిట్ కార్డులకు అందించాలని స్పష్టం చేసింది. …

Read More »

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సడెన్ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఇక ఎక్కువ కట్టాల్సిందే!

HDFC Bank Hikes MCLR Rate: ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాకింగ్ ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ పెంచిన లోన్ రేట్లు ఆగస్ట్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ పెరిగినట్లు తెలిపింది. సవరించిన తర్వాత బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్ల శ్రేణి 9.10 …

Read More »

మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8500 కోట్ల ఫైన్ వసూలు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Bank Account: బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్లయితే వాటిల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలని సూచిస్తుంటారు. ఒక వేళ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనట్లయితే పెనాల్టీలు విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్ల నుంచి ఏకంగా రూ.8500 కోట్లు వసూలు చేశాయట. ఈ అంశంపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ క్లారిటీ …

Read More »

స్మార్ట్‌టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌.. 5 రోజులు మాత్రమే.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

Smart TV Offers in Amazon Great Freedom Festival Sale 2024 : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ నడుస్తోంది. రకరకాల బ్రాండ్‌ ప్రొడక్ట్‌లను.. మంచి డిస్కౌంట్‌ ప్రైజ్‌లతో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రజల ఆదరణ పొందాయి. అలాగే ఆయా వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆఫర్లతో మన ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో.. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ గ్రేట్ …

Read More »

కుప్పకూలిన 7 స్టాక్స్.. ఏకంగా రూ. 50 లక్షల కోట్ల సంపద ఉఫ్.. అదే దెబ్బతీసింది!

Stocks Crash: ఒక్కసారిగా మళ్లీ మాంద్యం భయాలు విరుచుకుపడ్డాయి. స్టాక్ మార్కెట్లు మరోసారి సోమవారం రోజు అతలాకుతలమయ్యాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరే మిగిలింది. దేశీయ, అంతర్జాతీయ సూచీలు అన్నీ కుప్పకూలిపోయాయి. ముందుగా జపాన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోగా.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, చైనా- అమెరికా ట్రేడ్ వార్‌కు తోడు.. ఇటీవలి అమెరికా గణాంకాలు ప్రతికూల ప్రభావం చూపగా.. ఆర్థిక మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం రోజు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2 …

Read More »

దిగ్గజ సంస్థల బంపరాఫర్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. దానిపై రూ. 96 వేలు తగ్గింపు!

Honda Amaze Price: హోండా కార్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. సంస్థ వేర్వేరు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలో మంత్‌లీ డిస్కౌంట్ స్కీంలో భాగంగా ఇతర ఇన్సెంటివ్స్‌తో కలిపి వివిధ వేరియంట్ల ధరల్ని తగ్గించింది. ఈ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం.. ఇప్పుడు హోండా ఎలివేట్ SUV, హోండా సిటీ, హోండా అమేజ్ సెడాన్‌లపై ఆగస్టు చివరివరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా దీనితో పాటుగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని.. ఆ వేడుకల్లో భాగంగా ఆగస్టు నెలలో కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా …

Read More »

 గౌతమ్ అదానీ రిటైర్‌మెంట్ ప్రకటన.. ఇక వారి చేతుల్లోకి అదానీ గ్రూప్..!

అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ …

Read More »