శ్రీవారి మెట్టు మార్గంలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం..

తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద ఓ మహిళ, మరో యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సిబ్బందికి తెలియజేశారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరినీ కిందకు దించారు. అనంతరం అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన జంటను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లెకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం.

కొంగారెడ్డిపల్లికి చెందిన పాతికేళ్ల మహిళకు.. ఇప్పటికే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అదే గ్రామానికి చెందిన సతీష్ అనే 19 ఏళ్ల యువకుడితో సదరు మహిళకు సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక అనుకున్న విధంగానే మూడు రోజుల కింద భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి.. ఆ వివాహిత యువకుడితో వచ్చేసినట్లు తెలిసింది. మూడు రోజుల పాటు పలుచోట్ల తిరిగారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తీసుకుని శ్రీవారిమెట్టుకు వెళ్లారు. అయితే చివరి నిమిషంలో ఆ వివాహితకు భర్త గుర్తొచ్చాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం అతనికి ఫోన్‌లో చేరవేసినట్లు సమాచారం.

అనంతరం శ్రీవారిమెట్టు నడకమార్గంలో 450 మెట్టు వద్ద ఇద్దర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే విషయం తెలిసిన ఆ భర్త, అతని తరుఫు బంధువులు శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే పురుగుల మందు తాగటంచో ఇద్దరిని టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఆ భర్తే.. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇద్దరిలో ప్రియుడు సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే శ్రీవారిమెట్టు మార్గంలో జరిగిన ఈ ఘటనతో భక్తులు కాస్త కలవరపడ్డారు. వెంటనే స్పందించి టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం చేరవేయటంతో ఇద్దరిని వేగంగా ఆస్పత్రికి తరలించారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *