యాంకర్ సుమకి కిస్ ఇచ్చిన యాక్టర్.. వీడియో వైరల్.. చిన్మయిని ట్యాగ్ చేస్తున్న నెటిజన్లు

చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విక్రమ్‌కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‌ను యాంకర్ సుమ హోస్ట్ చేసింది. అయితే ఈవెంట్ అంతా బాగానే జరిగింది కానీ ఒక అనుకోని ఘటనతో సుమ అవాక్కవ్వాల్సి వచ్చింది.

యాంకర్ సుమకి కిస్

ఈవెంట్‌లో తంగలాన్ టీమ్ ఒక్కొక్కరూ స్టేజ్‌పైకి వచ్చి మాట్లాడారు. అలానే డేనియల్ అనే యాక్టర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి సినిమా గురించి మాట్లాడాడు. ఇక కిందకి వెళ్లేటప్పుడు థాంక్యూ అంటూ యాంకర్ సుమ షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో వెంటనే ఆ యాక్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చి సుమ చేతిపై కిస్ ఇచ్చాడు. ఈ అనుకోని ఘటనకి సుమ అవాక్కయ్యింది. ఆ యాక్టర్ మాత్రం ఇందులో ఏముంది అన్నట్లుగా నవ్వుకున్నాడు. అయితే ఆడియన్స్ గట్టిగా కేకలు వేస్తుండటంతో సుమ తేరుకొని కవర్ చేసే ప్రయత్నం చేసింది.

“నేను ఈరోజు ఇంటికెళ్తానా.. ఓరి నాయనో.. రాజా (రాజీవ్ కనకాల) ఈయన మా అన్నయ్య.. రాఖీ వస్తుంది.. అన్నయ్య సన్నిధి” అంటూ సుమ కవర్ చేసింది. అయితే ఈ ఘటనలో సుమ ఖచ్చితంగా ఇబ్బంది పడింది.. ఇది ఆమె ఫేస్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈవెంట్‌కి ఇబ్బంది కలగకూడదని సుమ కవర్ చేసింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ ఆ యాక్టర్‌ని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. అలానే సింగర్ చిన్మయిని ట్యాగ్ చేస్తూ ఈ ఘటనపై రియాక్ట్ అవ్వాంటూ కోరుతున్నారు.

ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిన్మయి పెద్ద యుద్ధమే చేస్తుంది. కన్సెంట్ (సమ్మతి) లేకుండా పిల్లలను కిస్ చేయడం, హగ్ చేసుకోవడం, దగ్గరికి తీసుకోవడం వంటి పనులు చేయకూడదని.. అది పేరెంట్స్‌కి అయినా వర్తిస్తుందంటూ చిన్మయి వాదిస్తుంది. ఇలాంటి వేళ సుమ కన్సెంట్ లేకుండా ఓ యాక్టర్ ఇలా పబ్లిక్‌గా కిస్ చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే చిన్మయి దీనిపై రియాక్ట్ అవ్వాలంటూ కోరుతున్నారు.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *