సీఎం రేవంత్ దక్షిణ కొరియా టూర్ రద్దు, 2 రోజుల ముందే ఇండియాకు.. క్లారిటీ ఇదే..!?

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీన మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 14 వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా.. మొదట అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది. మొదటి రోజు నుంచే రేవంత్ టీం.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.

ఆగస్టు 4వ తేదీ నుంచి 10 వరకు అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో పర్యటించి.. ఆగస్టు 11 నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నారని ముందుగానే షెడ్యూల్ వచ్చింది. అయితే.. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన రద్దయిందని.. ఆగస్టు 14న ఇండియాకు తిరిగి రావాల్సిన రేవంత్ రెడ్డి బృందం.. రెండు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 12వ తేదీనే వస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ నెల 15న కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ పదవి కోసం కొంత మంది ముఖ్య నేతలు పోటీపడుతుండగా.. కొందరు నేతలు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో.. టీపీసీసీలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. దక్షిణ కొరియా పర్యటన రద్దు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ నుంచి నేరుగా ఢిల్లీ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఈ వార్తలపై.. కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో బిజీ బిజీ ఉంటే.. కొందరు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ వర్గీయులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నాని.. చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రేవంత్ రెడ్డి తన పర్యటన పూర్తి చేసుకుని తెలంగాణకు చేరుకుంటారని చెప్తున్నారు.13న తన పర్యటన ముగించుకుని 14న ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకుంటారని అందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *