పోలీసులకు చిక్కిన కొరియోగ్రాఫర్ జానీ.. పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోన్న జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్‌ కొరియాగ్రాఫర్‌గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం.. ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు కూడా నమోదైంది.

ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన కోసం నెల్లూరుతో పాటు నార్త్ ఇండియాలోనూ పలు బృందాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి జానీ మాస్టర్ బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలియడంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ కేసులో బాధితురాలికి టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. బాధితురాలికి అండగా ఉండటంతో పాటు తాను నటించే అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక జానీ మాస్టర్ అలాంటివాడేనంటూ కొంతమంది చెబుతుండగా… ఇది జానీ మాస్టర్‌పై జరిగిన కుట్ర అంటూ కొంతమంది సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జానీ మాస్టర్ ఎప్పుడో లైంగిక వేధింపులకు పాల్పడితే బాధితురాలు ఇప్పుడే బయటపెట్టడం వెనుక ఎవరి హస్తమో ఉందంటూ ఓ వర్గం నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్‌‌పై కేసు నమోదు కాగానే జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువరించింది. మరోవైపు ఇది లవ్ జిహాదీ అంటూ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించడం కలకలం రేపుతోంది. మొత్తానికి జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *