నెల ఆలస్యంగా ‘కంగువా’.. రజినీకాంత్ కోసం సూర్య వెనకడుగు

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామా ‘కంగువా’ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయ్యన్‌ సినిమా విడుదల అవ్వబోతుంది. రజినీకాంత్‌ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువా సినిమా విడుదల విషయంలో మేకర్స్‌ ఆలోచనలో పడ్డారట. రజినీకాంత్‌ సినిమాకు పోటీ గా కంగువాను విడుదల చేయడం కచ్చితంగా పెద్ద తప్పు అవుతుంది. కనుక వెనకడుగు వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట.

దసరా బరి నుంచి తప్పుకుని వెంటనే దీపావళికి కంగువాను తీసుకు రావాలని మొదట భావించారట. కానీ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్న తర్వాతే రావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. నిన్నటి నుంచి కంగువా గురించి సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం నవంబర్‌ 14ను కొత్త రిలీజ్ డేట్‌ గా ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా నవంబర్‌ 14న విడుదల చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించిన విషయాలను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ‘కంగువా’ సినిమా సోలో రిలీజ్ అయితేనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించగలదు. అందుకే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీతో పోటీ వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు దాదాపు అన్నీ సోలో రిలీజ్‌ కు ఆసక్తి చూపిస్తున్నాయి. కనుక కంగువా సినిమాను వాయిదా వేసి తర్వాత సోలో రిలీజ్ చేయడం మంచిది అనే అభిప్రాయంను సూర్య ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. కంగువా సినిమాను తమిళ్‌ బాహుబలి అంటూ ప్రతిష్టాత్మకంగా ప్రమోషన్ చేస్తున్న మేకర్స్ రిలీజ్ కోసం దాదాపు ఆరు నెలలుగా వెయిట్‌ చేస్తోంది. ఇప్పుడు మరో నెల రోజుల ఆలస్యం కానుంది.

సూర్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న కంగువా లో బాలీవుడ్‌ హీరోయిన్ దిశా పటానీ నటించింది. బాబీ డియోల్‌, కిచ్చా సుదీప్‌, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యం లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ముందు ముందు సినిమాకు మరింత బజ్ క్రియేట్‌ చేసే విధంగా ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్న సమయంలో విడుదల తేదీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కంగువా ఎప్పుడు విడుదల అయినా కచ్చితంగా మంచి ఫలితాన్ని సాధించడం ఖాయం, బాలీవుడ్‌ తో పాటు అన్ని సౌత్ భాషల్లోనూ కంగువా సందడి చేయడం ఖాయం అనే అభిప్రాయంను మేకర్స్ ఇంకా సూర్య ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటి సారి తమిళ్‌ లో నిర్మిస్తున్న మూవీ అవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *