Recent Posts

ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి అంటున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ అల్లూరి …

Read More »

క్లీన్‌స్వీపే లక్ష్యంగా కాన్పూర్‌లో అడుగుపెట్టిన భారత్.. జర్నీ వీడియో షేర్ చేసిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు కాన్పూర్ చేరుకుంది. ఇప్పటికే తొలి మ్యాచులో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టులోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పటిష్ట భద్రత మధ్య వారిని.. పోలీసులు టీమిండియా బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ జట్టు కూడా …

Read More »

టీడీపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి. పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్‌ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. …

Read More »