Recent Posts

రాజమండ్రిలో చిక్కని చిరుత.. భయం గుప్పిట్లో శివారు ప్రాంతాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత కనిపించి 9 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ దానిని అటవీశాఖ బంధించలేకపోతోంది. దీంతో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాలైన దివాన్ చెరువు, లాలా చెరువు, స్వరూప్ నగర్, తారక నగర్, శ్రీరాంపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »

3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభం.. రామ్మోహన్ నాయుడా మజాకా!

ఏపీ వాసులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో్హన్ నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు …

Read More »

3 ఏళ్లకే లక్షకు రూ.7 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 3 షేర్లకు 1 షేరు ఫ్రీ..

టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ …

Read More »