Recent Posts

గుంటూరు: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …

Read More »

AP: ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్.. పూజారి పనే

ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి పేలుడు పదార్థాలతో గుడిని పేల్చివేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా …

Read More »

నేను ఆ మాట చెబితే పార్టీలో ఎవరికీ నచ్చకపోవచ్చు.. నా వల్ల మాత్రం కాదు: జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలు అనేంత దారుణమైన పాలనను చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందన్నారు. సూపర్‌-6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓటాన్ అకౌంట్‌తో నడిపిస్తున్నారని.. చంద్రబాబు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సులో …

Read More »