Recent Posts

వేములవాడ భక్తులకు శుభవార్త.. ఇకపై తిరుమల తరహాలో, ఆ భక్తులకు ఫ్రీగా లడ్డూ..!

దక్షిణ కాశీగా పేరుపొందిన.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. రాజన్నను దర్శించుకునేందుకు.. సామాన్య భక్తులే కాదు.. వీఐపీలు కూడా పోటెత్తుతుండటం విశేషం. ఈ మధ్య వీఐపీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. తిరుమల తరహాలోనే.. వేములవాడలోనూ బ్రేక్‌ దర్శనానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం తొలిరోజైన సోమవారం రోజు నుంచే ఈ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే.. ఈ …

Read More »

 గౌతమ్ అదానీ రిటైర్‌మెంట్ ప్రకటన.. ఇక వారి చేతుల్లోకి అదానీ గ్రూప్..!

అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ …

Read More »

నేటి నుంచి పారిస్ బరిలో మల్లయోధులు.. ‘పది పతకాలు’ దక్కాలంటే రెజ్లర్లు పట్టు పట్టాల్సిందే..!

Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …

Read More »