Recent Posts

విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అందజేశారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన …

Read More »

ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు:కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 2) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆమె అక్కినేని నాగార్జున కుటుంబం, హీరోయిన్ సమంత పేరు తెరపైకి తీసుకొచ్చారు. వారి వ్యకిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న సురేఖ.. మరో మహిళపై ఇటువంటి కామెంట్స్ …

Read More »

హిందూపురం: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రైతు.. వారానికే షాకిచ్చిన భార్య, ఊహించని ట్విస్ట్!

ఆయనో రైతు.. 40 ఏళ్లైనా పెళ్లి కావడం లేదు.. ఎన్నో సంబంధాలు చూసినా కుదరడం లేదు. తల్లిదండ్రులు వృద్ధులు.. కొడుకు పెళ్లి చూడాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు.. మధ్యవర్తుల్ని సంప్రదించడంతో ఓ సంబంధం కుదిరింది. అతడికి వివాహం కూడా అయ్యింది.. కానీ ఆ తర్వాత ఊహించని పరిస్థితి ఎదురైంది. వారం తర్వాత తరువాత ఆమె అతడికి మస్కా కొట్టి వెళ్లిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన …

Read More »