Recent Posts

ఈ ఫ్రూట్ ధర కేజీ రూ.500.. భారీ లాభాలు, యువ రైతు సక్సెస్ స్టోరీ

ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన యువ రైతు పోషకాల పండు సాగుతో భారీ లాభాలు అందుకుంటున్నారు. ముందు ఒక మొక్కను తెచ్చి నాటి చూశారు.. ఆ తర్వాత ఆ పండు విలువ తెలిసి సాగు ప్రారంభించారు. మంచి సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ పండు చూడటానికి నారింజ రంగు.. ఆగాకర వంటి ఆకారంలో కనిపిస్తుంది. ఈ కాయను కోసి చూస్తే.. పసుపు రంగు గుజ్జు మధ్య ఎర్రటి రసంలో గింజలు ఉంటాయి. ఆ పండు పేరు గ్యాక్ (గ్రేట్‌ అమెరికన్‌ కంట్రీ) …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్‌ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …

Read More »

2024: దసరాకు దుర్గ గుడికి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

విజయదశమి వచ్చిందంటే చాలు.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కిటకిటలాడిపోతుంది. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి భక్తులు పోటెత్తుతారు. అమ్మవారి రూపాలను చూసి తరిస్తుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కోసం అధికారులు కూడా విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై …

Read More »